వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ కోర్టులో బాంబు పేలుడు: ఇద్దరు మృతి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్‌లోని అరాహ్ సివిల్ కోర్టులో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

మృతుల్లో ఓ మహిళతో పాటు కానిస్టేబుల్ ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ పర్సులో బాంబు తీసుకుని కోర్టు ఆవరణలోకి వచ్చినట్లు సమాచారం. ఆ బాంబు పేలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Bomb Explosion Reported in Court in Arrah in Bihar

ప్రాధమిక నివేదికల ఆధారంగా మహిళ తెచ్చిన బాంబును ముడి చమురు బాంబుగా పోలీసులు అనుమానిస్తున్నామని బీహార్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాంబు పేలుడు ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, క్లూం టీం రంగంలోకి దిగింది.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదివారం భారత్‌కు రానున్న నేపథ్యంలో బాంబు పేలుడు సంభవించడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. భారత్‌లోకి నాలుగు గ్రూపులకు చెందిన ఉగ్రవాదులు ప్రవేశించారని ఐబీ హెచ్చరించిన మరుసటి రోజే బాంబు పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేసే అంశం.

English summary
One woman was feared killed and seven injured in an explosion in a court at Ara in Bihar’s Bhojpur district on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X