వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క ఫోన్ కాల్: కోచి విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామంటూ బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి అంతర్జాతీయ విమాశ్రాయ అధికారులకు సమాచారం వచ్చింది.

ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు. శనివారం ముంబై నుంచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మాదాబాద్ - ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

Bomb threat to Air India Mumbai flight sparks security alert

గురువారం రాత్రి ఓ ఆంగతకుడు కోల్ కత్తా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. దీంతో ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోచి విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

బాంబు డిటెక్షన్ మరియు డిస్పోజల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, సిఐఎస్ఎఫ్ మరియు పోలీసు విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, విమానాశ్రయం చుట్టు ప్రక్కల కూడా సెక్యూరిటీని పెంచారు.

ఈరోజు ఉదయం సీఐఎస్‌ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్ధాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.

English summary
A threat of a bomb explosion or a possible suicide attack on an Air India flight from Mumbai sparked an alert here with authorities beefing up security at the international airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X