వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు అజిత్, కాశ్మీర్‌పై మీ సాయం అవసరం లేదని భారత్ ధీటుగా..

భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ నెలాఖరులో చైనా వెళ్లనున్నారు. చైనాలో జరిగి బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ఈ నెలాఖరులో చైనా వెళ్లనున్నారు. చైనాలో జరిగి బ్రిక్స్ ఎన్ఎస్ఏ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

చిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపుచిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపు

ప్రస్తుతం చైనా - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అజిత్ దోవల్ ఈ నెల 26-27 తేదీల్లో చైనాలో ఉంటారని చెబుతున్నారు.

గత వారం హంబర్గ్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ మాట్లాడుకున్న విషయం తెలిసిందే. అయితే ఇది ఇరువురి మధ్య అధికారిక మీటింగ్ కాదని చైనా చెప్పింది.

డోక్లామ్‌ ప్రతిష్టంభనను చైనాతో పరిష్కరించుకోవడంలో దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలను కొనసాగిస్తామని విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది.

మోడీ, జీ మాట్లాడుకున్నారని..

మోడీ, జీ మాట్లాడుకున్నారని..

ఇటీవల జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ వివిధ అంశాలపై మాట్లాడుకున్నారని స్పష్టం చేసింది. దానికి సంబంధించిన చిత్రాన్నీ ట్వీట్‌ చేసిన విషయాన్ని గుర్తు చేసింది.

పలు అంశాలు

పలు అంశాలు

ప్రధాని మోడీ మోడీ, జీ జిన్‌పింగ్‌ మధ్య ఎలాంటి భేటీ జరగలేదని చైనా చెప్పడంపై గురువారం విలేకరుల సమావేశంలో ప్రశ్నించినప్పుడు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి గోపాల్‌ బాగ్లే ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఇరువురు వివిధ అంశాలు మాట్లాడుకున్నారని చెప్పారు.

వేటిపై మాట్లాడారో వ్యాఖ్యానించలేమని... ఇప్పటికే చెప్పాం

వేటిపై మాట్లాడారో వ్యాఖ్యానించలేమని... ఇప్పటికే చెప్పాం

వారిద్దరూ ఏయే అంశాలపై మాట్లాడారనేదానిపై తాను వ్యాఖ్యానించడం తగదని గోపాల్ బాగ్లే తెలిపారు. సరిహద్దు పైనా, మూడు దేశాల కూడలి పైనా విభేదాలను పరిష్కరించుకునేందుకు పరస్పర అంగీకారయోగ్య యంత్రాంగం ఉందని ఆయన తెలిపారు. డోక్లామ్‌ వద్ద భారత బలగాల ఉపసంహరణకు చైనా డిమాండ్‌ చేస్తోందా అని ప్రశ్నించగా... భారత్‌ దీనిపై తన వైఖరిని ఇది వరకే స్పష్టం చేసిందని గోపాల్ బాగ్లే తెలిపారు.

కాశ్మీర్‌పై ధీటుగా కౌంటర్

కాశ్మీర్‌పై ధీటుగా కౌంటర్

కాశ్మీర్‌ వివాదాన్ని పరిష్కరించడంలో మధ్యవర్తిత్వానికి చైనా ముందుకు రావడం గురించి బాగ్లే ఘాటుగా స్పందించారు. ఈ వివాదం భారత్‌-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక అంశమన్నారు. చైనా మధ్యవర్తిత్వం అవసరం లేదని, పాక్‌తో చర్చలకు సిద్ధమని చెప్పారు. తమ మధ్య మూడో వ్యక్తి అవసరం లేదన్నారు. భారత్ పైకి ఎగదోస్తున్న ఖండాంతర ఉగ్రవాదం, ప్రాంతీయంగానూ శాంతి-సుస్థిరతలకు ముప్పుగా మారిందన్నారు. ఎవరూ రసాయన ఆయుధాలు వాడకూడదనేది భారత్‌ వైఖరి అని తేల్చి చెప్పారు.

English summary
As India resolves to dissolve the Sikkim sector border standoff with Beijing through diplomatic channels, all eyes are on National Security Advisor Ajit Doval's likely visit to China for BRICS NSAs' meeting on 26 and 27 July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X