వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చాడు, వివాదం: ఆత్మహత్య చేసుకున్నాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Boy ends life after rebuked for gifting girl a mobile
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఓ బాలుడు ఓ అమ్మాయికి బహుమతి ఇచ్చాడు. అది వివాదం కావడంతో అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుండి పట్టణంలో పద్నాలుగేళ్ల బాలుడు ఓ అమ్మాయికి మొబైల్ బహుమతిగా ఇవ్వడంతో ఈ వివాదం చెలరేగింది.దీంతో, ఆ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బహుమతి తీసుకున్న బాలిక తండ్రి, అలాగే ప్రయివేటు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బాలుడి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారని, బాలికను వేధిస్తున్నారని వారికి చెప్పారని పోలీసులు తెలిపారు. పోలీసులు బాలుడి మృతదేహం వద్ద నుండి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.

తాను ఆత్మహత్య చేసుకుంటున్నందుకు బాలుడు తన సూసైడ్ నోట్లో క్షమాపణలు చెప్పాడు. దీంతో, బాలుడి తండ్రి ఉపాధ్యాయుడి పైన, బాలిక తండ్రి పైన, బాలిక పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అనిల్ బైర్వా అనే బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఓ స్నేహితుడి ద్వారా ఓ అమ్మాయికి మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. తన కూతురు చేతిలో మొబైల్ చూసిన తండ్రి.. ఎక్కడిది అని అడగడంతో ఆమె ఇచ్చిన అనిల్ బైర్వా పేరు చెప్పింది.

వెంటనే తండ్రి, ఓ ఉపాధ్యాయుడు ఆగ్రహంతో అనిల్ బైర్వా ఇంటికెళ్లారు. మరోసారి ఇలా చేయవద్దంటూ బాలుడిని అతడి తండ్రి ముందే హెచ్చరించాడు. మనస్తాపం చెందిన ఆ విద్యార్థి కొన్ని గంటల తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్ నోట్లో బాలుడు ఎవరినీ తప్పుబట్టలేదని పోలీసులు తెలిపారు.

English summary
Distressed over being criticized for gifting a mobile phone to a girl, a 14-year-old boy committed suicide by hanging himself in Bundi on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X