వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ఏడవను, నా కొడుకు చెప్పాడు: అమర జవాన్ తల్లి

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్స్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన జవాన్ గుర్నమ్ సింగ్ శనివారం రాత్రి అమరుడయ్యారు. చికిత్స పొందుతున్న గుర్నంను మెరుగైన వైద్యం కోసం ఎయిమ్స్‌కు తరలించాలని చూస్తుండగా దురదృష్టవశాత్తు చనిపోయారని ఓ అధికారి తెలిపారు.

కాగా, దేశాన్ని రక్షించే క్రమంలో తన కుమారుడు ప్రాణాలు కోల్పోయినందుకు బాసినందుకు గర్వంగా ఉందని గుర్నమ్‌ సింగ్‌ తల్లి జశ్వంత్ కౌర్‌ అన్నారు. తన కొడుకు తనకు చెప్పాడని, ఒకవేళ తాను చనిపోతే దయచేసి ఎవరూ బాధపడవద్దన్నాడని, అందుకే నేను ఏడవటం లేదని ఆ తల్లి చెప్పారు.

Jawan

దేశాన్ని రక్షించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను చూసి నేను ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. గాయపడిన తన కుమారుడుని బక్షి నగర్‌ ఆసుపత్రిలో చేర్పించారని, బీఎస్‌ఎఫ్‌కు సొంతంగా ఆసుపత్రి ఉంటే తన కొడుకును కాపాడగలిగేవారని గుర్నమ్ సింగ్ తండ్రి గుల్బీర్ సింగ్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను ఒక విజ్ఞప్తి చేస్తున్నానని.. మన దేశ జవాన్ల కోసం ఒక మంచి ఆసుపత్రి ఉంటే బాగుటుందని గుర్నమ్‌ సింగ్‌ తండ్రి గుల్బీర్‌ సింగ్‌ అన్నారు. కాగా, జమ్ము కాశ్మీర్‌లోని హిరానగర్‌ సెక్టార్‌లో పాక్‌ రేంజర్ల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతూ గుర్నమ్ మృతి చెందారు.

English summary
BSF Soldier, Injured In Pak Firing, Dies, Mother Says 'Won't Cry'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X