వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్ద్వాన్ పేలుళ్లు: మరో నలుగుర్ని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: బుర్ద్వాన్ పేలుళ్లతో సంబంధం ఉన్న మరో నలుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. ఈ నలుగురిలో ఒకరు ప్రధానంగా వ్యక్తులను రిక్రూట్ చేసుకుంటారని సమాచారం. నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జెఎంబి)కు చెందిన రిజుల్ కరీం కస్టడీని కోర్టు పొడిగించిన నేపథ్యంలో ఈ నలుగురి అరెస్ట్ వెలుగులోకి వచ్చింది.

Burdwan blast: NIA arrests four suspects, including alleged main recruiter

కరీంతోపాటు ఈ నలుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అరెస్టైన నిందితులలో కరీంతోపాటు షహనూర్ ఆలం, సఫిక్వల్ ఇస్లాం, రఫిక్వల్ ఇస్లాంలు ఉన్నారు. అక్టోబర్ 2న బుర్ద్వాన్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయం తెలిసిందే.

బంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జెఎంబికి సంబంధించిన వ్యక్తులు ఐఈడి బాంబులు తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. దీంతో ఎన్ఐఏ ఈ పేలుళ్లపై దృష్టి సారించింది. కేంద్రం కూడా ఎన్ఐఏకు ఈ పేలుళ్ల కేసును అప్పగించడంతో ఎన్ఐఏ విచారణ కొనసాగిస్తోంది.

English summary
National Investigation Agency (NIA) has arrested four more persons in connection with the Burdwan blast, as per news reports on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X