వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్కాలతో ఇంట్లోకి చొరబడి కాళ్లూచేతులూ కట్టేసి మహిళపై రేప్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ మీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని బెంగళూరులోని సిద్దాపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరులోని ప్రఖ్యాత లాల్ బాగ్ బోటానికల్ గార్డెన్స్ సమీపంలోని మార్కెట్ దగ్గర 21 సంవత్సరాల మహిళ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నది. గత వారం మహిళ కుటుంబ సభ్యులు సోంత పనులపై ఊరికి వెళ్లారు.

మహిళ ఒక్కరే ఇంటిలో ఉన్నారు. ఆ సందర్బంలో ఉదయం 11 గంటల సమయంలో బుర్కాలు వేసుకుని వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంటిలో చొరబడ్డారని, తరువాత పంజాబి డ్రస్ వేల్ తో తన కాళ్లు, చేతులు కట్టి వేసి నోటిలో బట్టలు కుక్కి సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఫిబ్రవరి 26వ తేదిన సిద్దాపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Burqa-clad men forcibly enter house, rape 21-yr-old

కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరిక్షలకు తరలించారు. మహిళ పొంతన లేకుండా మాట్లాడుతున్నదని పోలీసులు అంటున్నారు. అయితే తన మీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారు బుర్కాలు వేసుకున్నందున ముఖాలు గుర్తు పట్టలేకుండ పోయానని ఆమె అంటున్నది. అత్యాచారం చేసే సమయంలో ఎదురు తిరిగితే చంపేస్తామని వారు బెదిరించారని మహిళ ఆరోపిస్తున్నది. వైద్య నివేదిక అంద వలసి ఉందని సిద్దాపుర పోలీసులు అంటున్నారు.

అత్యాచారం జరిగిందా, లేదా అని వైద్య నివేదికలో వెలుగు చూస్తుందని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు అంటున్నారు. సిద్దాపుర పరిసర ప్రాంతాలలో ఒక వర్గం వారు ఎక్కువగా నివాసం ఉంటున్నారు. నిత్యం బుర్కాలు వేసుకుని ఇక్కడ సంచరిస్తుంటారు. ఆరోజు ఎవరు బుర్కాలు వేసుకుని మహిళ ఇంటిలోకి వెళ్లారు అని చెప్పలేకపోతున్నామని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహిళ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉన్న వారు ఎవరైనా అత్యాచారం చేశారా, పాత కక్లల కారణంగా అత్యాచారం చేశారా అని ఆరా తీస్తున్నామని బుధవారం సిద్దాపుర పోలీసులు తెలిపారు.

English summary
Burqa-clad men forcibly entered house, raped 21 year old woman in Bengaluru of Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X