వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కే కాదు: డీఎంకే స్టాలిన్‌కూ ప్రశాంత్ కిషోరే కావాలట

|
Google Oneindia TeluguNews

చెన్నై: 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధాని అవడంలో, బీహార్‌లో నితీష్ కుమార్, పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా నియమించుకున్న విషయం తెలిసిందే.

తాజాగా, ప్రశాంత్‌ కిషోర్‌ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు సేవలందించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు ఆ పార్టీ ముఖ్య నాయకులతో చర్చించినట్లు తెలుస్తోంది.

Buzz around DMK as team Prashant Kishor hits Tamil Nadu streets

Recommended Video

YS Jagan Confusing About Political Strategist Prashant Kishor

దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఆయన సన్నిహితుడు ఒకరు తెలిపినట్లు ఓ ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. కాగా, 2021లో తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి.

ప్రస్తుత తమిళ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత లేకపోవడంతో ఆ లోటును అందిపుచ్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల్లో పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ వైపే ఓటమి పాటలో ఉన్న పార్టీలు చూడటం గమనార్హం.

English summary
Attempting a strong comeback after Congress’ embarrassing loss in Uttar Pradesh and Uttarakhand assembly elections, poll strategist Prashant Kishor is exploring an entry into Tamil Nadu’s political arena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X