చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో టీవీ ప్రసారాలు బంద్: సోషల్ మీడియాలో ?

విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా పలువురు ప్రముఖులు ఇస్తున్న మద్దతు వారికి తెలయకుండా చెయ్యడానికి టీవీ చానల్స్ లో ఆ వార్తలు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు శాశ్వతంగా నిర్వహించడానికి చట్టం తీసుకురావాలని చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసులు హడలిపోతున్నారు. ఆందోళలు అదుపు చెయ్యడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

నేడు జల్లికట్టు, రేపు ఎండ్లబండ్లు, బుల్ బుల్ పిట్ట పోటీలు, శివసేన

మెరీనా బీచ్ లో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను అక్కడి నుంచి పంపించడానికి సోమవారం ఉదయం పోలీసులు విఫలయత్నం చేశారు. ఆ సమయంలో రెచ్చిపోయిన విద్యార్థులు సహనం కోల్పోయారు.

Tamil Nadu: Cable tv's got disconnected at many places in Tamilnadu to prevent violence.

పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో విద్యార్థులు మరింతరెచ్చిపోయి సమీపంలోని ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ కు నిప్పంటించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారని టీవీ చానల్స్ లో ప్రసారం కావడంతో కోయంబత్తూరు, మదురై, మైలాపూర్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారిపోయాయి.

శశికళతో పన్నీర్ సెల్వం భేటీ: ఎం చెప్పారంటే ?

పలుచోట్ల పోలీసు వాహనాలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపుచెయ్యడానికి పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమిళనాడులోని అనేక జిల్లాలు, సున్నితమైన అన్ని ప్రాంతాల్లో కేబుల్ టీవీ ప్రసారాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థులపై జరిగిన దాడులకు నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులకు పలువురు ప్రముఖులు ఇస్తున్న మద్దతు వారికి తెలయకుండా చెయ్యడానికి టీవీ చానల్స్ లో ఆ వార్తలు ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు విద్యార్థులకు సంపూర్ణమద్దతు ఇవ్వడంతో పోలీసులు తలలుపట్టుకుంటున్నారు.

English summary
Tamil Nadu: Cable tv's got disconnected at many places in Tamilnadu to prevent violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X