వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెలలో చేస్తాం, మోడీకి వ్యాపారమే: డ్రగ్స్‌పై రాహుల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: పంజాబ్‌లో అత్యంత తేలికైనది డ్రగ్స్ వ్యాపారమేనని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమ పార్టీకి అధికారం అప్పగిస్తే ఒక్క నెలలోనే రాష్ట్ర్లం డ్రగ్స్ లేకుండా చేస్తామన్నారు. పంజాబ్‌లో పెరిగిపోయిన డ్రగ్స్ వినియోగం, శాంతిభద్రతల పరిస్థితుల పైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పంజాబ్‌లోని జలంధర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం పెరిగిపోవడానికి ప్రభుత్వమే కారణమన్నారు.

rahul

డ్రగ్స్‌ వ్యాపారం వల్ల ప్రభుత్వం లాభపడుతోందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించాలన్నారు. అది కేవలం కాంగ్రెస్‌కే సాధ్యమన్నారు. ఒక్కసారి ప్రజలు తమ పార్టీకి ఓటువేసి గెలిపిస్తే పంజాబ్‌లో డ్రగ్స్ లేకుండా చేస్తామన్నారు.

ఈ విషయంలో అకాళీదళ్‌ ప్రభుత్వం విఫలవమడానికి బీజేపీ కూడా కారణమన్నారు. ఎప్పుడు చూసిన ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారం గురించే మాట్లాడుతారని, అవి కూడా తేలికైన వ్యాపారాల గురించేనని, పంజాబ్‌లో అత్యంత తేలికైన వ్యాపారం డ్రగ్స్ అమ్మకాలే అన్నారు. పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్‌ని ప్రోత్సహిస్తోందని, ఎందుకంటే దానికి డ్రగ్స్ మాఫియా నుంచి లబ్ధి చేకూరుతుందన్నారు. ఒక్క నెలలో సమస్యను పరిష్కరించగలమన్నారు.

English summary
Congress Vice President Rahul Gandhi today made a searing attack on the Akali Dal-led government in Punjab, accusing it of encouraging the illegal trade of drugs in the state and promising to end the menace in a month if the Congress is voted to power in assembly elections to be held early next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X