వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వసూలు చేసిన పోలీస్

|
Google Oneindia TeluguNews

మీరట్: పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయవచ్చునని మరోసారి నిరూపించారు. బైక్ మీద హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానా వసూలు చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం. అయితే కారులో డ్రైవింగ్ చేసే సమయంలో హెల్మెట్ పెట్టుకోలేదనే కారణంతో ఒకరికి పోలీసు జరిమానా విధించాడు.

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగిన ఈ విచిత్ర సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మీరట్ లో నివాసం ఉంటున్న శైలేందర్ సింగ్ (43) అనే ఆయన ఆదివారం రాత్రి నాలుగు సంవత్సరాల కుమారుడిని పిలుచుకుని మారుతి షిఫ్ట్ కారులో డాక్టర్ దగ్గరకు బయలుదేరాడు.

మార్గం మధ్యలో హసన్ పుర్ సమీపంలో ట్రాఫిక్ పోలీసు అధికారి కారును ఆపేశాడు. కారు రికార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలని చెప్పాడు. అన్ని సక్రమంగా ఉండటంతో ఆ ట్రాఫిక్ పోలీసు అధికారికి చిర్రెత్తింది. ఎలాగైనా ఫైన్ వెయ్యాలని అనుకున్నాడు.

 a car driver in Meerut has been challaned for not wearing a helmet.

తాను కుమారుడికి చికిత్స చేయించడానికి ఆసుపత్రికి వెళ్లాలని శైలేందర్ సింగ్ బ్రతిమలాడాడు. అయితే పోలీసు అధికారి కనికరించలేదు. అంతే ఆయనగారికి ఓ అద్భుతమైన ఆటోచన వచ్చింది. హెల్మెట్ పెట్టుకోలేదని, ఫైన్ కట్టాలని చకచక రసీదు వ్రాసి చలాను చేతిలో పెట్టాడు. శైలేందర్ సింగ్ కు మతిపోయింది.

తరువాత అపరాధ రుసుం చెల్లించాడు. సోమవారం ఎస్పీని కలిసి పోలీసు అధికారి మీద ఫిర్యాదు చేశారు. తాను ఎన్నో సంవత్సరాల నుండి కారు నడుపుతున్నానని, కారు నడిపే సమయంలో హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పినట్లు తాను ఎక్కడా వినలేదని శైలేందర్ సింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రికి వెళుతున్నామని చెప్పినా ఆయన వినలేదని వెంటనే ఆ పోలీసు అధికారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని శైలేందర్ సింగ్ ఫిర్యాదు చేశారు. విచారణ చేసి పోలీసు అధికారి తప్పు చేసినట్లు వెలుగు చూస్తే అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి దూబే శైలేందర్ కు హామి ఇచ్చారు.

English summary
The incident happened in the Hasanpur area of the city on Sunday evening when Shailender Singh was stopped by a traffic police officer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X