వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు 5వేలు దాటిందా... అయితే క్రెడిట్, డెబిట్ కార్డు వాడాల్సిందే?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 5 స్టార్ హోటళ్లలో ఉన్నా, అక్కడ తిన్న బిల్లులను కార్డుల ద్వారానే చెల్లించాలనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.

ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఐదు వేలు రూపాయలు దాటిన ఏ లావాదేవికైనా తప్పనిసరిగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది.

 Card payment may soon be mandatory for 5-star bills

నగదు రహిత లావదేవీలకు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వాలో ఈ కమిటీ సూచిస్తుందన్నారు. లావాదేవీల ఛార్జీలను అవసరమైతే ప్రభుత్వం పంచుకునే అవకాశం ఉందన్నారు. నల్లధనాన్ని నియంత్రించడానికి క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీలన్నీ ఈ కార్డుల ద్వారానే జరిగేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. దీంతో నల్లధనాన్ని కొంత వరకు తగ్గించవచ్చనే అభిప్రాయంతో కేంద్రం యోచిస్తోంది.

English summary
Seeking to curb the use of cash for high-value transactions and check the flow of black money in the economy, the government may make it mandatory to undertake certain transactions — such as payment of hotel bills beyond a specified limit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X