వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'సుఖేష్' గురించి విస్తుపోయే నిజాలు: ఇన్ని ఆస్తులా?..

17ఏళ్ల వయసు నుంచే సుఖేష్ నేరాల చిట్టా మొదలైందని, అప్పట్లో కాంట్రాక్టు పనులు ఇప్పించడంలో మధ్యవర్తిగా వ్యవహరించి.. ఓ కేసులో ఇరుక్కున్నాడని పోలీసులు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాలు మరోసారి కీలక మలుపు తీసుకోవడంలో 'సుఖేష్' పాత్ర కీలకంగా మారింది. ఢిల్లీలో ఇతను పట్టుబడటం వల్లే దినకరన్ బాగోతం బట్టబయలైంది. ఎన్నికల సంఘానికి, దినకరన్ కు నడుమ మధ్యవర్తిగా వ్యవహరించిన సుఖేష్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

దినకరన్ ఏజెంట్ సుకేష్: తవ్వినకొద్దీ, వైఎస్ అల్లుడినంటూ...దినకరన్ ఏజెంట్ సుకేష్: తవ్వినకొద్దీ, వైఎస్ అల్లుడినంటూ...

అరెస్టు అనంతరం సుఖేష్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్లో సుఖేష్ ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు.. అతన్ని అరెస్టు చేసిన సమయంలో చేతికి 6.5కోట్ల విలువైన ఖరీదు బ్రేస్ లెట్ ఉంది. సుమారు రూ.7లక్షల విలువైన షూస్ ఆయన గదిలో ఉన్నాయి. రూ.1.30కోట్ల నగదు కూడా అతని చేతిలో ఉంది.

Cars, Cash, Con: The Lavish Lifestyle of Dinakaran's 'Middleman' Sukesh

వాస్తవానికి నల్లధనం ఫిర్యాదులతో సుఖేష్ గదిలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్నారు. చెన్నై ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకె పార్టీకి రెండాకుల గుర్తును కేటాయించేలా ఎన్నికల సంఘంతో లాలూచీ కుదిర్చేందుకు గాను ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ నుంచి రూ.50కోట్ల మేర డీల్ కుదుర్చుకున్నట్లుగా వెల్లడైంది.

చెన్నై, బెంగుళూరు సహా పలు ప్రాంతాల్లో సుఖేష్‌పై 12క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో ఫామ్ హౌజ్ లు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. 17ఏళ్ల వయసు నుంచే సుఖేష్ నేరాల చిట్టా మొదలైందని, అప్పట్లో కాంట్రాక్టు పనులు ఇప్పించడంలో మధ్యవర్తిగా వ్యవహరించి.. ఓ కేసులో ఇరుక్కున్నాడని పోలీసులు తెలిపారు. అయితే మైనర్ కావడంతో అప్పట్లో అతన్ని అరెస్టు చేయలేదని, ఆపై మరో సంవత్సరం తర్వాత అదే కేసులో ఇరుక్కుని జైలుకెళ్లాడని పోలీసు వర్గాలు చెప్పుకొచ్చాయి.

కాగా, మంగళవారం నాడు చెన్నై వెళ్లిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దినకరన్ ను అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరవాల్సిందిగా కోరనున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెన్నై రావడంతో దినకరన్ సైతం అలర్ట్ అయ్యారు. న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చూడాలి మరి ఈ కేసు ఇంకే మలుపు తిరుగుతుందో!

English summary
The Delhi Police on Monday arrested Sukesh Chandrasekar, the alleged middleman who struck a Rs 50-crore deal with AIADMK leader TTV Dinakaran to help influence the war over the party’s election symbol of “two leaves”. Police also seized Rs 1.5 crore and a BMW and a Mercedes car from him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X