వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు కస్టడీకి బీజేపీ చీఫ్ కొడుకు

హరియాణా ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుంద్రాను అర్దరాత్రి వెంబడించి వేధింపులకు గురి చేసిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాను రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ ఛంఢిగడ్.

|
Google Oneindia TeluguNews

ఛంఢీగడ్: హరియాణా ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుంద్రాను అర్దరాత్రి వెంబడించి వేధింపులకు గురి చేసిన ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాను రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ ఛంఢిగడ్ జిల్లా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఐఏఎస్ అధికారి కుమార్తెకు వేధింపులు: హరియాణా బీజేపీ చీఫ్ కొడుకు వికాస్ అరెస్టు !ఐఏఎస్ అధికారి కుమార్తెకు వేధింపులు: హరియాణా బీజేపీ చీఫ్ కొడుకు వికాస్ అరెస్టు !

గురువారం ఛంఢీగడ్ జిల్లా న్యాయస్థానం ముందు వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్ కుమార్ ను హాజరుపరిచారు. ఐఏఎస్ అధికారి కుమార్తె వర్ణికా కుంద్రాను అర్దరాత్రి వేధింపులకు గురి చేసిన వికాస్ బరాలా, ఆశిష్ కుమార్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మనవి చేశారు.

Chandigarh stalking case Vikas Bharala friend remanded to two days police custody

కేసు వివరాలు తెలుసుకున్న జిల్లా కోర్టు ద్విసభ్య బెంచ్ న్యాయమూర్తులు రెండు రోజుల పాటు వికాస్ బరాలా, ఆశిష్ కుమార్ ను కస్టడీకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అర్దరాత్రి స్నేహితుడితో కలిసి తాను యువతిని వేధించానని ఇప్పటికే వికాస్ బరాలా అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

మద్యం మత్తులో వికాస్ బరాలా, అతని స్నేహితుడు ఆశిష్ కుమార్ వర్ణికా కుంద్రా అనే యువతిని వేధించారని ఆరు సీసీకెమెరాల్లో రికార్డు అయ్యిందని హరియాణా డీజీపీ లుథారా మీడియాకు చెప్పారు. మొత్తం మీద హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలా మెడకు ఈ కేసు చుట్టుకుంది.

English summary
Vikas Barala, son of Haryana BJP leader Subhash Barala has been remanded to two days police custody in the Chandigarh stalking case. The police produced Vikas and his friend Aashish before a magistrate today and sought their remand in police custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X