చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మారుతున్న పరిణామాలు: తమిళనాడులో పదవులకే ప్రియారిటీ, కారణమిదే!

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నైతమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి. వ్యక్తిపూజకు పెద్ద పీట వేసే పార్టీలు, ప్రస్తుతం పదవులకు పెద్దపీట వేస్తున్నాయి. నాటకీయ వ్యూహాలకు, పరిణామాలకు తమిళనాడు రాజకీయాల్లో ప్రసిద్ది చెందాయి.

తమిళనాడులో వ్యక్తిపూజకు ప్రాధాన్యత ఇచ్చేవారు. అయితే నాటకీయత అన్ని దశల్లోనూ కొనసాగుతున్నాయి.అయితే మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చోటుచేసుకొంటున్నాయి.

తమిళనాడులో ద్రవిడ పార్టీల ఆవిర్భావం నుండి నేటివరకు నాటకీయ పరిణామాలు రాజకీయపార్టీల్లో సర్వసాధారణంగా మారాయి.వ్యక్తి పూజ ధోరణిలో కూడ మార్పులు కన్పిస్తున్నాయి.

పదవే పరమావధిగా కన్పిస్తోంది.అభిమానించినవారి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడ వెనుకాడని నైజం తమిళ ప్రజలది. అయితే ఈ పరిణామాల్లో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి.

వ్యక్తి పూజకు ప్రాధాన్యత

వ్యక్తి పూజకు ప్రాధాన్యత

వ్యక్తిపూజకు తమిళనాడులో ప్రాధాన్యత ఇస్తారు. రాజకీయాల్లో కూడ వ్యక్తిపూజ ధోరణి అధికంగా ఉంటుంది. ఒక వ్యక్తిని లేదా పార్టీని, పార్టీలోని నాయకుడిని అభిమానిస్తే వారిని అందలం ఎక్కించేవరకు విశ్రమించరు. తాము అభిమానించిన వారి కోసం గుళ్ళు కట్టడం లాంటి ఘటనలను కూడ చూశాం.వింత మొక్కులతో ప్రజలు వారి కోసం త్యాగాలు చేస్తుంటారు.అయితే కాలానుగుణంగా ఈ పరిణామాల్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి.

ద్రవిడ పార్టీల ఏర్పాటుతో మార్పులు

ద్రవిడ పార్టీల ఏర్పాటుతో మార్పులు

1916 లో దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని తమిళనాడులో ఏర్పాటు చేశారు. ఈ సంఘం తమిళ రాజకీయం ఆరంభమైంది.ఈ సంఘం క్రమంగా జస్టిస్ పార్టీగా రూపాంతరం చెందింది.అనంతరం 1940 లో ఈవీ రామస్వామి నాయకర్ నాయకత్వంలో ఇది ద్రవిడ కళగం గా మారింది.స్వతంత్ర ద్రవిడనాడు సాధనే తమ లక్ష్యమని అప్పట్లోనే ప్రకటించారు. అన్నాదురై, పెరియార్ మధ్య తొలిసారిగా విభేదాల కారణంగా ఈ పార్టీ రెండుగా చీలిపోయింది.

డిఎంకెలో చీలిక ఇలా

డిఎంకెలో చీలిక ఇలా

ద్రవిడ కళం నుండి విడిపోయి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఏర్పాటైంది. 1956 లో డిఎంకె ఎన్నికల్లో పోటీచేసింది. 1960లో జరిగిన హిందీ వ్యతిరేక ఆందోళన సమయంలో డిఎంకె బలం పుంజుకొంది .1967 లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి అధికారం కైవసం చేసుకొంది. 1969 లో అన్నాదురై మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు.కరుణానిధితో విభేదించిన సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ బయటకొచ్చాడు.1972లో ఆయన అన్నాడిఎంకె ను ఏర్పాటుచేశాడు. 1977లో అన్నాడిఎంకె అధికారంలోకి వచ్చింది.1987లో ఆయన మరణించేవరకు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగారు.

1967 నుండి ద్రవిడ పార్టీలదే హావా

1967 నుండి ద్రవిడ పార్టీలదే హావా

దేశంలో కాంగ్రెస్ ప్రాభవం కొనసాగిన రోజుల్లోనే తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడ పార్టీల హవా మొదలైంది. అన్నాడీఎంకె, డిఎంకెల మధ్యే 1967 నుండి అధికారం దోబుచూలాడుతూ వస్తోంది.కాంగ్రెస్ తో సహ ఇతర జాతీయ పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేకుండాపోయింది.అధికారం మాత్రం డిఎంకె, అన్నాడిఎంకె పార్టీల మధ్యే దోబుచూలాడుతోంది.

మారుతున్న పరిస్థితులు

మారుతున్న పరిస్థితులు

1906 నుండి 2016 వరకు తమిళ రాజకీయాలు వేరు. ఆ తర్వాత మార్పులు చేర్పులు చోటుచేసుకొన్నాయి. నాయర్, పెరియార్ల నుండి అన్నాదురై కరుణానిధి, ఎంజీఆర్ , జయలలిత వరకు అందరికీ ఒక చరిష్మా ఉంది. దాంతోనే వారు రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకొన్నారు. జయలలిత మరణం, కరుణానిధి వయో భారంతో వ్యక్తి రాజకీయాలకు దాదాపుగా తెరపడినట్టే కన్పిస్తోందని రాజకీయ విశ్లేషలకులు అభిప్రాయపడుతున్నారు.పదవికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాలను చూస్తే అర్థమౌతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Changes in Tamil nadu politics,once upon a time personworship in Tamilnadu state.it has been changed ,after Jayalalithaa power politics in Tamil nadu state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X