చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టులో స్టాలిన్ కు భారీ ఎదురు దెబ్బ: తమిళనాడు సీఎం బలపరీక్షకు నో !

తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కు మద్రాసు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు లేదని,

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎంకే. స్టాలిన్ కు మద్రాసు హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఎమ్మెల్యేల మద్దతు లేదని, ఆయన బలపరీక్షకు మరో సారి సిద్దం కావాలని డీఎంకే పార్టీ పోరాటం చేస్తోంది.

<strong>నా కూతురు రెచ్చగొట్టింది, అందుకే రేప్ చేశాను: హెడ్ కానిస్టేబుల్, అల్లుడికి తెలిసింది !</strong>నా కూతురు రెచ్చగొట్టింది, అందుకే రేప్ చేశాను: హెడ్ కానిస్టేబుల్, అల్లుడికి తెలిసింది !

శాసన సభలో జులై 11వ తేదీన సీఎం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేస్తూ డీఎంకే పార్టీ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గురువారం డీఎంకే సమర్పించిన పిటిషన్ విచారణకు వచ్చింది.

Chennai HC rejects MK Stalin's plea on koovathur horse trading today.

డీఎంకే సమర్పించిన పిటిషన్ విచారణ చేసిన ధర్మాసనం ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించడానికి నిరాకరించింది. తమిళనాడు ప్రభుత్వం బలపరీక్ష నిర్వహించుకునే అవసరం లేదని, పళనిసామికి ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టులో వాదించారు.

<strong>నన్ను చంపేస్తాం అంటూ 32 సార్లు ఫోన్: శశికళ, దినకరన్ వర్గంపై కేసు పెట్టిన ఎంపీ !</strong>నన్ను చంపేస్తాం అంటూ 32 సార్లు ఫోన్: శశికళ, దినకరన్ వర్గంపై కేసు పెట్టిన ఎంపీ !

వాదనలు విన్న న్యాయస్థానం జులై 11వ తేదీన ఎడప్పాడి పళనిసామి తన మెజరిటీ నిరూపించుకోవడానికి బలపరీక్ష నిర్వహించుకునే అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కువత్తూరు రిసార్టులో ఎమ్మెల్యేలు నిర్బంధించి డబ్బులు ఎర వేసిన తరువాత సీఎంగా పళనిసామి బలపరీక్షలో నెగ్గారని, ఇప్పుడు మళ్లీ బలపరీక్ష నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని డీఎంకే పార్టీ మద్రాసు హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

English summary
Chennai HC rejects MK Stalin's plea on koovathur horse trading today. Hearing on trust voting will be on july 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X