వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రేమో ఎస్ ఐ, కొడుకు దొంగ, 3 అంతస్థుల భవనమున్నా చోరీలు మానలేదు

ఆమె మూడంతస్థుల భవనానికి యజమానురాలు.అయితే ఆమె దొంగతనాలు మాత్రం మానలేదు. దొంగతనాలు చేయడం హాబీగా మార్చుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కృష్ణరాజపుర: ఆమె మూడంతస్థుల భవనానికి యజమానురాలు.అయితే ఆమె దొంగతనాలు మాత్రం మానలేదు. దొంగతనాలు చేయడం హాబీగా మార్చుకొంది. ప్రతి చిన్న వస్తువును కూడ ఆమె దొంగిలించకమానడం లేదు.అయితే చివరికి పోలీసులకు చిక్కింది. పొట్టకూటి కోసం మాత్రం ఆమె దొంగతనం చేయడం లేదు. హాబీగా దొంగతనాలు చేయడాన్ని అలవాటు చేసుకొంది.

మేడహళ్ళికి చెందిన మంజుల అనే మహిళకు మూడంతస్థుల భవనం ఉంది. ఈ భవనం అద్దె వేలాది రూపాయాలు వస్తాయి.అయితే ఆమెకు దొంగతనం హాబీగా మారింది.దీంతో చిన్న పాలప్యాకెట్ సహా ఏది కనబడితే అది దొంగతనం చేస్తోంది.

పక్కింట్లో కన్పించే ఏ వస్తువును ఆమె వదలదు. పాల ప్యాకెట్లు, సోపా కవర్లు, కిటీకీ స్క్రీన్లు ఇలా ఏ వస్తువైనా ఆమె దోచుకొంటోంది. మునియప్ప గార్డెన్ కు చెందిన సలీం అనే వ్యక్తికి చెందిన మారుతీ కారు, సోఫా కవర్లు, డైనింగ్ టేబుల్ కవర్లు ఇతర వస్తువులను ఆమె చోరి చేసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొన్న పోలీసులు బుదవారం నాడు మంజులను అరెస్టు చేసి వాహానాన్ని స్వాధీనం చేసుకొన్నారు.

Chetan arrested for theft laptop in Karnataka state

తండ్రి పోలీసు కొడుకు దొంగ

కర్ణాటక రాష్ట్రంలోని హెచ్ ఎ ఎల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ గా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడు చేతన్ దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ముగ్గురు మిత్రులతో కలిసి ఆయన ల్యాప్ ట్యాప్ లను దొంగించేవాడు.బుదవారం నాడు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

చేతన్ మరో ముగ్గురు స్నేహితులు శరవణ, బషీర్, నవీన్ లతో కలిసి ఆరు నెలలుగా హాస్టళ్ళలో పీజీల్లోకి చొరబడి ల్యాప్ ట్యాప్ లు , సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నారు. దొంగిలించిన ల్యాప్ ల్యాప్ లను , ఫోన్లను అందంగా ప్యాక్ చేసి జేసీ రోడ్డు ప్రాంతంలో విక్రయించేవారు.

దొంగతనాలకు స్వంత బైక్ పై వెళ్తే పట్టుబడతామనే భయంతో అద్దెకు బైక్ లను వినియోగించుకొనేవారు. చోరిలపై కేసు దర్యాప్తు చేపట్టిన హెచ్ ఎ ఎల్ పోలీసులు సీసీ టీవి దృశ్యాలను పరిశీలించి బైక్ నంబర్ గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

బైకులు అద్దెకు ఇచ్చే వ్యక్తి ని విచారిస్తే చేతన్ సెల్ ఫోన్ నెంబర్ దొరికింది. ఈ నెంబర్ ఆధారంగా మేజిస్టిక్ లాడ్జీలో బస చేసిన చేతన్ ను బుదవారం నాడు తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. చేతన్ ను విచారించి మిగిలిన ముగ్గురిని కూడ పోలీసులు అరెస్టు చేశారు.

రెండేళ్లుగా చేతన్ ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు చెప్పారు. ల్యాప్ ట్యాప్ ల చోరీల కేసులో పలుమార్లు జైలుకెళ్ళి రెండు మాసాల క్రితమే బెయిల్ పై విడుదలైనా తన నేరప్రవృత్తిని కొనసాగిస్తున్నాడు.

English summary
Chetan arrested for theft laptop in Karnataka state, Chetan, is the son of who is working in SI at HAL police station.police arrested Chetan and others on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X