వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్‌సైట్ల బ్యాన్‌పై ఆగ్రహం, 'బెడ్‌రూంల్లోకి వస్తారేమో'

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: పోర్న్ వెబ్‌సైట్ల పైన కేంద్రం అనుసరిస్తున్న తీరు పైన ప్రముఖ రచయిత చేతన్ భగత్ విమర్శలు గుప్పించారు. అశ్లీల సైట్లను నిషేధించడం సరికాదని, అది వ్యక్తి స్వేచ్ఛకు వ్యతిరేకమని ఆయన అన్నారు.

అది రాజకీయపరంగా ఏమంత మంచి నిర్ణయం అనిపించుకోదన్నారు. ప్రజల వ్యక్తిగత జీవితాలను నియంత్రించరాదని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశారు. నిషేధించాల్సింది పోర్న్ సైట్లను కాదని, మగవాళ్ల దొంగచూపులను నిషేధించండి, వేధింపులను నిషేధించాలన్నారు.

కేంద్రం పోర్న్ సైట్లను నిషేధించడంపై సెలబ్రటీలు మండిపడుతున్నారు. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా వారు తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.

Chetan Bhagat criticises government's decision to ban porn sites

బాలీవుడ్ నటి మినీషా లాంబ స్పందిస్తూ.. ఇప్పుడు పోర్న్ సైట్లను నిషేధించిన ప్రభుత్వం త్వరలో ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్ చూడటంపై కూడా నిషేధం విధిస్తుందేమో అని సందేహం వ్యక్తం చేసింది. వీటిని నిషేధిస్తే పుస్తకాలు చదువుకోవచ్చనుకుంటున్నారేమో అంది. మిమ్మల్ని పుస్తకాలు చదువుకోనివ్వకుండా వాటినీ నిషేధిస్తారని పేర్కొంది.

ప్రభుత్వం నిర్ణయంపై సంగీత దర్శకుడు విశాల్ దద్లాని కూడా స్పందించారు. ప్రభుత్వం నిర్ణయం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. నిషేధం విధించిన పార్టీకి చెందిన ఎంపీలే సభలో నీలి చిత్రాలు చూస్తూ దొరికిపోయారన్నారు. అలాంటి వారిని నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందేమో అన్నారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ నిలిపేయడం హాస్యాస్పదమని, ఈ చర్య కూడా అలాంటిదే అన్నారు. ప్రస్తుతానికి పోర్న్ సైట్లను మాత్రమే నిషేధించారని, తొందరలోనే ప్రభుత్వం పడకగదిలోకి కూడా ప్రవేశిస్తుందేమో అని ట్వీట్ చేశాడు.

English summary
Chetan Bhagat criticises government's decision to ban porn sites, calls it 'anti-freedom'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X