వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా: మానస సరోవర యాత్రకు బ్రేక్!

సిక్కింలోని నాథులా పాస్‌ను మూసివేసినట్లు మంగళవారం నాడు చైనా తెలిపింది. కైలాస మానస సరోవర యాత్రకు భక్తులు నాథుకా పాస్ నుంచి వెళ్తారు. ఈ మార్గాన్ని చైనా మూసివేసింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సిక్కింలోని నాథులా పాస్‌ను మూసివేసినట్లు మంగళవారం నాడు చైనా తెలిపింది. కైలాస మానస సరోవర యాత్రకు భక్తులు నాథుకా పాస్ నుంచి వెళ్తారు. ఈ మార్గాన్ని చైనా మూసివేసి.. కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నం చేస్తోంది.

సిక్కింలోని సరిహద్దుల్లో భారత్‌ - చైనా సైనికుల బాహాబాహి, భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ నాథూలా పాస్‌ను మూసివేసినట్టు ప్రకటించింది.

చైనాకు చెందిన పిపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ జవాన్లు సిక్కింలోని సరిహద్దుల మీదుగా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి భారత సైన్యం బంకర్లను ధ్వంసం చేసింది.

China confirms Nathu La pass closed because of border stand-off with India

చైనా సైనికుల దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొన్న భారత సైన్యం వారిని సరిహద్దులోకి రాకుండా అడ్డుకుంది. మానవహారంగా నిలబడి డ్రాగన్‌ సైనికులను వెనక్కి పంపింది.

ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణాత్మక పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కైలాస్‌ మనస సరోవర్‌ యాత్ర మార్గాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు చైనా చెప్పింది.

సరిహద్దుల్లో ఘర్షణాత్మక పరిస్థితికి భారత సైన్యమే కారణమని చైనా సైన్యం నిందించింది. సరిహద్దుల్లోని తమ భూభాగంలో రోడ్డు నిర్మాణం చేపడుతుంటే భారత సైన్యం అడ్డుకొని రెచ్చగొట్టిందని, అందుకే బంకర్ల ధ్వంసం ఘటన జరిగిందని పేర్కొంది.

కాగా, నాథులా పాస్‌ను మూసివేసిన విషయం నిజమేనని చైనా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రకు నాథులా పాస్‌ రెండో మార్గం. దీనిని 2015లోనే తెరిచారు. ఈ మార్గం ద్వారా ఈ నెల 19-23 తేదీల మధ్య 47 మంది ప్రయాణికులు బయలుదేరారు. మరో మార్గమైన ఉత్తరాఖండ్‌లోని లిపుల్‌కేహ్‌ ద్వారా 1080 మంది ప్రయాణికులు కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారు.

English summary
China on Tuesday confirmed that it has stopped entry of Kailash Mansarovar pilgrims through the Nathu La pass because of an on going stand-off between Chinese and Indian troops at the border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X