వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌కి క్షమాపణ చెప్పిన కేంద్రమంత్రి (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

పనాజీ: భారతదేశానికి క్రికెట్ మతమైతే.. సినిమా ప్రత్యామ్నాయ మతమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గోవా రాజధాని పనాజీలో ‘45వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (ఐఎఫ్ఎఫ్ఐ-ఇఫ్ఫీ)ని అరుణ్ జైట్లీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వెయ్యి సినిమాలను నిర్మిస్తూ మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు.

‘భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంలా కొలుస్తారని అన్నారు. అది నిజమే కానీ, సినిమాను కూడా ఒక ప్రత్యామ్నాయ మతంలా మన దేశంలో అభిమానిస్తారు' అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఇఫ్ఫీ కార్యక్రమాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

భారతదేశానికి క్రికెట్ మతమైతే.. సినిమా ప్రత్యామ్నాయ మతమని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

గోవా రాజధాని పనాజీలో ‘45వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం' (ఐఎఫ్ఎఫ్ఐ-ఇఫ్ఫీ)ని అరుణ్ జైట్లీ గురువారం ప్రారంభించారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వెయ్యి సినిమాలను నిర్మిస్తూ మనదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని అన్నారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

‘భారత్‌లో క్రికెట్‌ను ఒక మతంలా కొలుస్తారని అన్నారు. అది నిజమే కానీ, సినిమాను కూడా ఒక ప్రత్యామ్నాయ మతంలా మన దేశంలో అభిమానిస్తారు' అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదిక మీద ఉన్న వ్యక్తుల పేర్లను చదివారు. ఈ క్రమంలో రజనీకాంత్ పేరును మరిచిపోయారు. ఆ విషయాన్ని వెంటనే గుర్తించి క్షమాపణ చెప్పడంతో రజనీ చిరునవ్వు నవ్వారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ‘సెంటినరీ అవార్డు'ను, హాంకాంగ్‌కు చెందిన వాంగ్‌కార్ వాయ్‌కి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

ఈ సందర్భంగా రజనీకాంత్ మూడు దశాబ్దాల కెరీర్‌ తాలూకూ వీడియోను ప్రదర్శించారు.

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ

ఇఫ్ఫీ కార్యక్రమాన్ని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

కాగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రసంగాన్ని మొదలుపెడుతూ వేదిక మీద ఉన్న వ్యక్తుల పేర్లను చదివారు. ఈ క్రమంలో రజనీకాంత్ పేరును మరిచిపోయారు. ఆ విషయాన్ని వెంటనే గుర్తించి క్షమాపణ చెప్పడంతో రజనీ చిరునవ్వు నవ్వారు. తాను రెండు కాగితాలపై పేర్లు రాసుకున్నానని, కానీ ఒకే పేపర్ పైనున్న పేర్లు మాత్రమే చదివానని కేంద్రమంత్రి చెప్పారు.

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ‘సెంటినరీ అవార్డు'ను, హాంకాంగ్‌కు చెందిన వాంగ్‌కార్ వాయ్‌కి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మూడు దశాబ్దాల కెరీర్‌ తాలూకూ వీడియోను ప్రదర్శించారు. ఈ సమయంలో రజనీ భావోద్వేగంతో అమితాబ్‌ పాదాలను స్పృశించారు. ఇది ఇలా ఉండగా ప్రారంభోత్సవానికి జనం భారీగా తరలిరావడంతో గందరగోళం చెలరేగింది. పలువురు ప్రముఖులు, విదేశీయులు సీట్లు దొరకక నేలమీదే కూర్చున్నారు.

English summary
Cricket may be termed as a religion in India but cinema is an alternative religion, Union Information and Broadcasting Minister Arun Jaitley today said after inaugurating the International Film Festival of India (IFFI) in Goa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X