వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఆరోగ్యం: అపోలో చైర్మన్ క్లారిటీ ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేదని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్. సి. రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అక్టోబర్ 1వ తేదిన తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఆసుపత్రి చెర్మన్ డాక్టర్ ప్రతాప్. సి. రెడ్డి ఆయన వెంట ఉన్నారు. తరువాత కేంద్ర మంత్రులు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చిన తరువాత ఆయన వారిని ఆసుపత్రిలోకి ఆహ్వానించారు.

CM Jayalalithaa, Apollo hospital chairman Dr Pratap. C. Reddy

జయలలిత ఆరోగ్యం గురించి వారికి క్షుణ్ణంగా వివరించారు. అయితే కేవలం తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావు పక్కన ఒకే ఒక్క సారి మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో డాక్టర్ ప్రతాప్. సి. రెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడలేదు.

ఇంత కాలానికి ఆయన మీడియా ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే నాయకులు రోజుకోక మాట మీడియాకు చెప్పడంతో మళ్లి అమ్మ అభిమానుల్లో అనుమానాలు ఎక్కువ అయ్యాయి. గత నెల 21తరువాత అపోలో ఆసుపత్రి వర్గాలు అధికారికంగా జయలలిత ఆరోగ్యంపై మీడియా ముందుకు రాలేదు.

ఇప్పుడు స్వయంగా అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్. సి. రెడ్డి మీడియా ముందుకు వచ్చి జయలలిత ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంతో అన్నాడీఎంకే వర్గాలతో పాటు పార్టీ కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వం జయలలిత ఆరోగ్యంపై మీరే స్వయంగా క్లారిటీ ఇవ్వాలని అపోలో చైర్మన్ ప్రతాప్. సి. రెడ్డికి మనవి చెయ్యడంతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారని సమాచారం.
ఈనెల 7వ తేదీ లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచ్చర్డ్ మళ్లీ చెన్నై వస్తున్నారని సమాచారం.

English summary
Apollo hospital chairman Dr Pratap. C. Reddy said that TN Chief Minister Jayalalithaa completely recovered and when to return home depends on her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X