వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొగ్గు కుంభకోణం: స్టే విధించిన సుప్రీం, మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌కు ఊరట

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్‌కు తాత్కాలిక ఊరట లభించింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లపై దేశ అత్యున్నత న్యాయస్ధానం స్టే విధించింది. దీంతో పాటు మన్మోహాన్ సింగ్‌ పిటిషన్‌పై మూడు వారాల్గోగా సమాధానం ఇవ్వాలని సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

దేశం మొత్తాన్ని ఒక కుదుపు కుదిపిన బొగ్గు కుంభకోణంలో కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ విచారణకు హాజరు కావాలని సీబీఐ ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహాన్ సింగ్‌ సుప్రీం కోర్టునిు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Coal scam: SC stays summons to Manmohan Singh

ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు స్టే విధించింది. మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్, డి. భట్టాచార్య, హిందాల్కో సంస్ధకు ఊరట లభించింది.

ఒరిస్సాలోని తలాబిరా-2 బొగ్గు బ్లాకును హిందాల్కోకు కేటాయించడంపై దాఖలైన కేసులో మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ నిందితుడిగా కోర్టు పేర్కొంటూ ఏప్రిల్ 8న విచారణకు హాజరుకావాలని సీబీఐ కోర్టు సమన్లు ఇచ్చింది. దీనిపై తనకు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

English summary
The Supreme Court on Wednesday stayed the trial court's decision to summon former PM Manmohan Singh, industrialist Kumar Mangalam Birla, former coal secretary PC Parakh and three others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X