వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలమ్: ఆధార్‌పై వివాదాలు-అవగాహన

పలు మీడియా ఛానళ్లలో ఆధార్, దాని ఆలస్యం వల్ల జరిగే పరిణామాలపై తీవ్ర చర్చలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే, ప్రజల్లో మాత్రం ఆధార్‌పై స్పష్టమైన అభిప్రాయపమే ఉన్నట్లు తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పలు మీడియా ఛానళ్లలో ఆధార్, దాని ఆలస్యం వల్ల జరిగే పరిణామాలపై తీవ్ర చర్చలు జరుగుతన్న విషయం తెలిసిందే. అయితే, ప్రజల్లో మాత్రం ఆధార్‌పై స్పష్టమైన అభిప్రాయపమే ఉన్నట్లు తెలుస్తోంది. ఆధార్ ప్రాథమిక భావనలు, గమనించిన పలు విషయాలను నేను ఈ ఆర్టికల్ ద్వారా పంచుకుంటున్నాను.

ఆధార్ గుర్తింపు కార్డును ఇప్పుడు దాదాపు అందరూ తీసుసుకున్నారు. ఆధార్ ఎందుకనే విషయం దాదాపు ప్రజలందరికీ తెలిసింది. కానీ, కొందరు దీనిపై భిన్న భావాలు వ్యక్తం చేస్తున్నారు. యూఐడీఏఐ మనదేశంలో ఉండే ప్రతీ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన సంఖ్యను కేటాయిస్తోంది. దీనిపై ఆన్‌లైన్ వెరిఫికేషణ్ సర్వే కూడా చేస్తోంది. ఏవైనా సేవలు పొందాలంటే ఆధార్ లింక్ ఉండాలని యూఐడీఏఐ పేర్కొనలేదు.

1. ఆధార్ ప్రత్యేకమైనది. పాస్ పోర్ట్, ప్యాన్, ఎలక్షన్ కార్డ్ లాంటి వాటిలాగే ఇది కూడా. వేలిముద్ర, కంటి(ఐరిష్) గుర్తింపు ద్వారా ఆధార్ రూపొందడం వల్ల దీంతో మరొకటి చేయడానికి వీలుండదు. ఆధార్ గుర్తింపు కార్డ్ కొన్ని పరిమితులను కలిగివుంది. అందువల్ల బ్యాంక్, పీడీఎస్ లాంటి తదితర సంస్థలు, రంగాలు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కొత్త తరం సాంకేతికతతో రూపొందిన గుర్తింపు కార్డు కావడంతో చాలా సంస్థలు కూడా ఆధార్‌కు ప్రాముఖ్యతనిస్తున్నాయి.

విద్యుత్ లేని జీవితాన్ని కోరుకుంటారా? లేక దాని ఉపయోగాలను గుర్తించి జీవితాన్ని సుఖమయం చేసుకుంటారా? అనేది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్ గుర్తింపు కూడా ఉన్నత ప్రమాణాలతో ఇవ్వడం జరుగుతోంది. కొన్ని లోపాలున్నప్పటికీ వాటిని అధిగమించి ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. వేలి ముద్ర, ఐరిష్‌లను తీసుకుని ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల పలు రకాల మోసాలను కూడా నివారించవచ్చు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఆధార్‌లు ఉండే అవకాశమే లేదు. ఆధార్‌కు ముందు ఫొటో ఐడీ కార్డులను ఉపయోగించేవారు. కానీ, వీటిని ఎడిటింగ్ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉండేది. కానీ, ఆధార్‌ను దుర్వినియోగం చేయడం సాధ్యం కాదు.

COLUMN: Understanding Aadhaar and debunking controversies!

2
ప్రస్తుత ప్రపంచానికి అనుగుణంగా ఆధార్ ఐడీ కార్డును రూపొందించడం జరిగింది. ఏ దేశంలోనైనా జన్మ నమోదుతో గుర్తింపు మొదలవుతుంది. ప్రపంచ బ్యాంక్ 2008 అంచనాల ప్రకారం.. భారతదేశంలో 52.8శాతం జననాలు మాత్రమే నిపుణులైన సిబ్బంది ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రపంచంలో మాత్రం 99శాతం ఆస్పత్రిల్లోనే జరుగుతున్నాయి. అందువల్ల పుట్టే పిల్లలకు గుర్తింపు ఇవ్వడం ఇతర దేశాల్లో చాలా సులభం. కానీ, మనలాంటి దేశాల్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఆధార్ తీసుకురావడం జరిగింది. పుట్టిన వెంటనే ఆధార్ తీసుకోకపోతే ఆ తర్వాతనైనా తీసుకోవాల్సి ఉంటుంది.

A.ప్రమాణీకరణ లోపించడం

ఇతర ఐడీల మాదిరిగా కాకుండా ఆధార్‌కు ప్రామాణికత ఎక్కువగా ఉంది. ఆధార్‌ను తప్పుగా ఉపయోగించినా కూడా వెంటనే తెలిసిపోతుంది. ఏపీ, తెలంగాణల్లోని పీడీఎస్ లలో బయోమెట్రిక్‌ తప్పులను గుర్తించి, వాటిని తొలగించడం జరిగింది. నిబంధనల ద్వారా ఆహారపదార్థాలను ప్రజలకు వేరుచేయవద్దని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.

ఫాల్స్ రెజెక్ట్ రేట్

వేలిముద్ర, ఐరిష్ తీసుకోవడం వల్ల ఆధార్‌కు ప్రామాణికత ఎక్కువగా ఉంటుంది. 98శాతం వేలిముద్ర సరైన ఫలితాలిస్తుండగా, ఐరీష్ పూర్తిస్థాయి గుర్తింపును ఇస్తోంది. అయితే, ఆధార్ ఎన్రోల్ చేసుకునేటప్పుడు తీసుకునే వ్యక్తి, గుర్తింపును ఇచ్చే వ్యక్తి కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తప్పులు జరగకుండా ఆధార్ గుర్తింపును పూర్తి చేసినా బాధ్యత తీసుకునే వ్యక్తి, ఆధార్ ఇచ్చే వ్యక్తిపై ఉంటుంది.

ఒక వేలి ముద్ర బదులు రెండు వేలి ముద్రలను ఇవ్వడం వల్ల ఆధార్ ప్రామాణికతను పెంచుకోవచ్చు. అలాగే టైపింగ్ తప్పులు లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనైనా తప్పులను సరిదిద్దుకోవాలి.

బెస్ట్ ఫింగర్ డిటెక్షన్(బీఎఫ్‌డీ): బాగున్న వేలి ముద్రలను మాత్రమే ఆధార్ తీసుకునే సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో గుర్తింపు సమస్యను అధిగమించవచ్చు.

B.
కాస్ట్స్ వర్సెస్ బెనిఫిట్స్, సేవింగ్స్..

ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందు కోసమే పటిష్టమైన ఆధార్‌ను రూపొందించడం జరిగింద. ఆధార్ విశిష్ట సంఖ్య ద్వారా వ్యక్తులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను కూడా ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉంటోంది.

C. చాలా దేశాలు ఇప్పటికే గుర్తింపునిస్తున్నాయి..

చాలా దేశాలు ఇప్పటికే గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. మనదేశంలో ఆధార్ కు ముందు ఎలక్షన్ ఐడీ కార్డునే వాడేవారు. కానీ, ఈ ఐడీ కార్డుకు డూప్లకేట్లను కూడా తయారు చేసేవారు కొందరు. అయితే, ఆధార్ ను ఇలా చేయడం కుదరదు. విశిష్ట సంఖ్యతో ప్రత్యేకంగా రూపొందించిన ఆధార్‌తో ప్రభుత్వానికి ప్రజలకు చాలా ప్రయోజనమే ఉంది.

COLUMN: Understanding Aadhaar and debunking controversies!

D. కంట్రోల్ డేటా

మీకు సంబంధించిన డేటాను పలు కంపెనీలు సేకరించడం నుంచి మీరు నియత్రించలేరు. ట్రూకాలర్‌లో మీ పేరు కూడా ఎలా వస్తోందో.. మీ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ నెంబర్ ఏదైనా ఫోన్లో నమోదై ఉంటుంది కాబట్టి. అయితే, ఆధార్ విషయంలో చట్టం మీ డేటాకు రక్షణ కల్పిస్తుంది. మీ ఆధార్ కు సంబంధించిన వివరాలను ఇతర సంస్థలు వినియోగించుకోకుండా చూస్తుంది. ఆధార్ ను విమర్శించడం కంటే ప్రామాణికతను పెంచాలని కోరితే బాగుంటుంది.

ముగింపు

మీ వ్యక్తిగత డేటాను భద్రపర్చడంతోపాటు ఆధార్‌తో అనేక ప్రయోజనాలున్నాయి. అందువల్లే చాలా సంస్థలు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. ఆధార్‌ను విస్తృతం చేయడం వల్ల ప్రజలు సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు వీలుకలుగుతుంది. ఆధార్‌పై విమర్శలు రావడం శోచనీయం. ఆధార్‌ను సరైన దిశలో ఉపయోగించి దాని ప్రయోజనాలను పొందాల్సిన అవసరం ఉంది. ఇదంతా నా వ్యక్తిగత అభిప్రాయం.

-శ్రీకాంత్ కార్వా
(యూఐడీఏఐ- ప్రొజెక్ట్ డిజైన్, ఇంప్లిమెంటేషన్‌పై పనిచేశారు)

English summary
Several media reports have been discussing Aadhaar and its misuse of late. People may have differing views, but it is important that the facts about Aadhaar are clearly understood. I am writing an article that explains some of the basic concepts about Aadhaar while addressing some common concerns observed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X