వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

26/11 ఉగ్రదాడి: నేటికి ఏడేళ్లు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

ముంబై: పాకిస్థాన్ ఉగ్రవాదులు నరరూప రాక్షసులుగా మారి ముంబై మహానగరంలో నరమేధం సృష్టించి నేటికి ఏడేళ్లు కావస్తున్నది. ఉగ్రవాదులు జరిపిన దాడులలో దాదాపు 180 మందికి పైగా మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

ఈ దాడిలో దాదాపు 700 మందికి తీవ్రగాయాలైనాయి. చాల మందికి అవయవాలు తెగిపోవడంతో ఇప్పటికీ వారు వికలాంగులుగానే మిగిలిపోయారు. 2008 నవంబర్ 26న జరిగిన ఈ నరమేధంలో మరణించిన వారికి గురువారం నివాళులు అర్పించారు.

ముంబై నగరంలోని నారీమన్ హౌస్ దగ్గర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మృతులకు నివాళులు అర్పించారు. ముంబై దాడులలో మరణించిన భారతీయులు, విదేశీయుల ఆత్మకు శాంతికలగాలని దేవుడిని ప్రార్థించారు.

కేంద్ర హోం శాఖ మంత్రి

కేంద్ర హోం శాఖ మంత్రి

26/11 దాడులలో మరణించిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ న్యూఢిల్లీలో నివాళి అర్పించారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

కఠిన చర్యలు తీసుకుంటాం

26/11 దాడులకు పాల్పడిన వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హెచ్చరించారు.

26/11 ఉగ్రదాడి: నేటికి ఏడేళ్లు (ఫోటోలు)

26/11 ఉగ్రదాడి: నేటికి ఏడేళ్లు (ఫోటోలు)

ముంబై దాడులు జరిగి నేటికి ఏడు సంవత్సరాలు పూర్తి కావచ్చిన సందర్బంగా ముంబై నగరంలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ లలో గట్టి బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని ముఖ్య మంత్రి ఫడ్నవీస్ ఆదేశాలు జారీ చేశారు.

మృతుల కుటుంబ సభ్యులు

మృతుల కుటుంబ సభ్యులు

26/11 దాడులలో మరణించిన మృతుల కుటుంబ సభ్యులు చాల మంది గురువారం ముంబై నగరం చేరుకుని నివాళి అర్పించారు.

దేశ వ్యాప్తంగా నివాళి

దేశ వ్యాప్తంగా నివాళి

26/11 దాడులలో మరణించిన వారికి దేశంలోని పలు నగరాలు, పట్టణాలలో నివాళి అర్పించారు. ఇలాంటి దుర్ఘటన ఇంకోసారి జరగరాదని దేవుడిని ప్రార్థించారు.

సైనికులకు సెల్యూట్

సైనికులకు సెల్యూట్

ఉగ్రవాదులను అంతం చేసే సమయంలో వీరమరణం పొందిన ఎన్ఎస్ జీ కమాండోలకు ఇదే సందర్బలో సెల్యూట్ చేసి నివాళి అర్పించారు.

కనికరం లేకుండా చంపేశారు

కనికరం లేకుండా చంపేశారు

చిన్నా పెద్ద అని తేడా లేకుండా మహిళలు, వృద్దులను అతి దారుణంగా చంపేసిన ఈ రోజు (26/11)ముంబై నగరంలో బ్లాక్ డేగా మిగిలిపోయింది.

English summary
Maharashtra Chief Minister Devendra Fadnavis was among the dignitaries who paid homage at the 26/11 police memorial site at the Mumbai Police Gymkhana in south Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X