వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగ్మా వర్సెస్ ఝాన్సీరాణి: నగ్మా చెన్నైకి వచ్చినా ఝాన్సీ నో రెస్పాన్స్!

ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మాకు, టీఎన్‌సీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీరాణిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీంతో మే 20న జరగాల్సిన టీఎన్‌సీసీ మహిళా విభాగం

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, సినీ నటి నగ్మాకు, టీఎన్‌సీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఝాన్సీరాణిల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. దీంతో మే 20న జరగాల్సిన టీఎన్‌సీసీ మహిళా విభాగం సమావేశం రద్దైనట్లు తెలిసింది.

వాస్తవానికి మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా విజయధరణి ఉన్న సమయంలో ఎలాంటి విభేదాలు లేకుండా ప్రశాంతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ విభాగం బాధ్యతలను ఝాన్సీరాణికి అప్పగించారు. దీన్ని అనేకమంది మహిళా కాంగ్రెస్‌ నేతలు జీర్ణించుకోలేక పోయారు.

Conflicts Between Nagma and Jhansi Rani

తమ కంటే జూనియర్‌ అయిన ఝాన్సీరా ణికి అధ్యక్ష పదవిని ఎలా కట్టబెడుతారంటూ రాష్ట్ర ఇంచార్జ్‌గా ఉన్న నగ్మాను నేరుగా ప్రశ్నించసాగారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారం మేరకు ఝాన్సీరాణిని నిలదీయడంతో వారిమధ్య మనస్పర్థలు తలెత్తాయి.

Conflicts Between Nagma and Jhansi Rani

ఇటీవల నగ్మా చెన్నై పర్యటనకు వచ్చినపుడు వారి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తన పర్యటన గురించి వివరాలు తెలియజెప్పేందుకు ఝాన్సీరాణిని ఫోనులో సంప్రదించగా ఆమె ఆందుబాటులో లేకుండా పోయారు. దీన్ని నగ్మా సీరియస్‌గా తీసుకోవడంతో మే 20న స్థానిక రాయపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్‌లో జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేశారు.

English summary
It said that Conflicts occurred between Tamil Nadu Congress leaders Nagma and Jhansi Rani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X