హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మార్చే ప్రసక్తి లేదు: ఎయిర్ పోర్ట్‌లో ఎన్టీఆర్ పేరుపై జైట్లీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు పెట్టడం పైన రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. పేరు మార్పు పైన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం పైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జైట్లీ మాట్లాడుతూ.. పేరు మార్పు పైన వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. అనంతరం రాజ్యసభ అరగంట వాయిదా పడింది.

Congress creates uproar in Rajya Sabha over renaming of Shamshabad airport

అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగనున్నారు. ఎన్టీఆర్ పేరుపై మంగళవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో ఆ పార్టీ ఎంపీలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వి హనుమంత రావు సహా పలువురు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్లకార్డులు చేతబట్టి సభలో నిరసన తెలిపారు. బుధవారం నాటి సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో ఈ అంశంపై చర్చించేందుకు అవకాశమివ్వాలని వారు రాజ్యసభ ఉపాధ్యక్షుడికి నోటీసు ఇచ్చారు.

English summary
Congress creates uproar in Rajya Sabha over renaming of Shamshabad airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X