వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ-యోగి ఎఫెక్ట్: చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ 'హిందుత్వ'

2014 సార్వత్రిక ఎన్నికల నుంచి నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకు.. ఢిల్లీ, బీహార్ వంటి ఒకటి రెండు మినహా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు బీజేపీ దృష్టి గుజరాత్‌పై పడింది.

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి నిన్నటి అయిదు రాష్ట్రాల ఎన్నికల వరకు.. ఢిల్లీ, బీహార్ వంటి ఒకటి రెండు మినహా బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పుడు బీజేపీ దృష్టి గుజరాత్‌పై పడింది.

గుజరాత్‌లో బీజేపీకి ఇప్పటి వరకు తిరుగు లేదు. అయితే, పటేళ్ల ఉద్యమం వంటి అంశాలు ఇటీవల తెరపైకి వచ్చాయి. ఇది బీజేపీకి ఇబ్బందిని తీసుకు వచ్చే అంశమే. గుజరాత్‌లో ఈసారి 150 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

స్టార్ కంపెయినర్లు

స్టార్ కంపెయినర్లు

ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వారు స్టార్ కంపెయినర్‌లుగా ఉంటున్నారు. బీజేపీకి హిందుత్వ ముద్ర ఉంది.

హిందుత్వ అజెండా

హిందుత్వ అజెండా

గతంలో మైనార్టీలు మూకుమ్మడిగా ఓ పార్టీకి ఓటు వేసేవారు. హిందువులు కూడా తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్నారు. దీంతో వారు కూడా కొంతలో కొంత మూకుమ్మడి ఓటుకు మరలుతున్నట్లుగా కనిపిస్తోంది. యూపీ సహా ఇటీవల జరిగిన పలు ఎన్నికలు అందుకు నిదర్శనం అంటున్నారు.

బీజేపీకి కౌంటర్‌గా కాంగ్రెస్

బీజేపీకి కౌంటర్‌గా కాంగ్రెస్

ఈ నేపథ్యంలో బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కూడా గుజరాత్ ఎన్నికల్లో హిందుత్వ అజెండాను తెరపైకి తీసుకు రానుందని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తు ఎన్నికల అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

కాంగ్రెస్ ఇలా.. బీజేపీ అలా

కాంగ్రెస్ ఇలా.. బీజేపీ అలా

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. గుజరాత్ ఎన్నికల్లో హిందుత్వ అంశంతో ముందుకు వెళ్లాలని నేతలకు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి హిందుత్వ ముద్ర ఉంది. దాంతో పాటు అభివృద్ధి అంశాలతో ఎన్నికలకు వెళ్ళనుంది.

English summary
The BJP is in election mode once again and this time it is battle Gujarat. The party has set a target of 150 seats and will have Prime Minister Narendra Modi, BJP's national president Amit Shah and Uttar Pradesh Chief Minister Adityanath Yogi as the star campaigners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X