వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లోకి చొరబడి గృహిణిపై రేప్: కానిస్టేబుల్ అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: రక్షించాల్సిన కానిస్టేబులే ఘాతుకానికి పాల్పడ్డాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఓ కానిస్టేబుల్ గృహిణిపై అత్యాచారం చేశాడు. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బెల్డా అనే గ్రామంలో నిఖిల్ మండల్ అనే కానిస్టేబుల్ బుధవారనాడు ఇంట్లోకి చొరబడి మహిళపై అత్యాచారం చేశాడు.

స్థానికులు అతన్ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని మండల్‌ను అత్యాచారం ఆరోపణలపై అరెస్టు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటిండెంట్ వరుణ్ చంద్రశేఖర్ చెప్పారు.

Constable held for raping housewife in Bengal

మహిళపై అసభ్యంగా పోలీసులు

ఓ వివాహితపై ఇద్దరు పోలీసులు పశ్చిమ బెంగాల్‌లోని చేట్లా పోలీసు స్టేషన్ పరిధిలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ మహిళ కోల్‌కతాలోని ఓ ప్రముఖ వ్యాపారి కుటుంబానికి చెందినవారు. తాము చేట్లా పోలీసు స్టేషన్‌లో అధికారుల పేర్లు ఉటంకిస్తూ ఫిర్యాదు చేశామని, పోలీసులు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులంటూ ఫిర్యాదు నమోదు చేసుకున్నారని ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మహిళ ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేశామని, ఎఫ్ఐఆర్‌లో పేర్లు ఏవీ చేర్చలేదని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు. రాత్రి పూట రోడ్డుపై నడుస్తున్న మహిళపై పోలీసు అసభ్యకరమైన వ్యాఖ్య చేశాడని, దాంతో ఆగ్రహించిన మహిళ నిరసన వ్యక్తం చేసిందని, స్థానికులు వెంటనే ఆమెకు రక్షణగా ముందుకు వచ్చారని, వారు చేట్లా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా కూడా చేశారని, ఆ ఒత్తిడితో కేసు నమోదు చేశారని, కానీ నిందితుడి పోరు చేర్చలేదని అంటున్నారు.

English summary

 A police constable was arrested Thursday for allegedly raping a housewife in West Bengal's West Midnapore district, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X