వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు మోడీ ఎన్నో గిఫ్ట్‌లు: పర్యటనలో వివాదాలు... (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన బహుమతులు సోషల్ మీడియాలో వెల్లడించారు. 1957లో భారత పర్యటనకు వచ్చిన అమెరికన్ సింగర్ మరియన్ అండర్సన్ ఇక్కడ పాడిన గీతాల రికార్డులను మోడీ ఒబామాకు అందించారు.

అదే సమయంలో ఆకాశవాణిలో ప్రసారం అయిన అండర్సన్ ఇంటర్వ్యూ, గాంధీ స్మారకార్థం ఆయన పాడిన లీడ్ క్లైండ్లీ లైట్ గీతం రికార్డు ఇచ్చారు. అమెరికా నుండి భారత్ వచ్చిన తొలి టెలిగ్రామ్ కాపీని కూడా అందించారు.

అలాగే 1950 జనవరి 26న విడుదలైన స్టాంప్, విలువైన చీరలు, పలు బహుమతులు ఇచ్చారు. మరోవైపు, బరాక్ ఒబామా పర్యటన సమయంలో కొన్నింటి పైన చర్చ కూడా సాగింది. ఒకటి రెండు వివాదాస్పదమయ్యాయి కూడా.

రెడ్ కార్పెట్ పైన కుక్క

రెడ్ కార్పెట్ పైన కుక్క

ఒబామా పర్యటన సందర్భంగా ఓ ఊరకుక్క అధికారులను హడలెత్తించింది. రాష్ట్రపతి భవన్‌లో రెడ్ కార్పెట్ పైన పరుగులు పెట్టింది. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఊరకుక్క ఎలా ప్రవేశించిందో తెలియక భద్రతా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కుక్కను బందించి అక్కడి నుండి తరలించారు.

 చూయింగ్ గమ్

చూయింగ్ గమ్

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకల సమయంలో చూయింగ్ గమ్ నములుతూ కెమెరాలకు చిక్కారు. ఇది వివాదాస్పదమైంది.

ఉప రాష్ట్రపతి

ఉప రాష్ట్రపతి

రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ శాల్యూట్ చేయక పోవడం పైన సామాజిక మాధ్యమాల్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పలు విమర్శలు వచ్చాయి. దాని పైన కార్యాలయం వివరణ కూడా ఇచ్చింది.

మోడీ, ఒబామా

మోడీ, ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా టీ కలిపి ఇచ్చారు. ఇది చర్చనీయాంశమైంది.

కిరణ్ బేడీ

కిరణ్ బేడీ

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనను భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఉపయోగించుకోవాలనే యోచనలో ఉందనే ఊహాగానాలు వినిపించాయి.

English summary
Five controversies related to Barack Obama’s Republic Day visit to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X