వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమె దేశానికి పెద్ద ఆస్తి: సుష్మాపై వెంకయ్యనాయుడు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ దేశానికి పెద్ద ఆస్తి అని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఉదయం పార్లమెంట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి సుష్మా, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఎలాంటి తప్పు చేయలేదని, తప్పు చేయనప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.

అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరు కాంగ్రెస్‌కు కంటగింపుగా ఉందన్నారు. అన్ని అంశాలపై చర్చిస్తామన్నా.. కాంగ్రెస్‌ సభ్యులు సభ జరగనివ్వటం లేదని వెంకయ్యనాయుడు విమర్శించారు. పంచతంత్ర పేరుతో ఐదు పథకాలను ప్రజలముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

Country's big asset, says Venkaiah on Sushma Swaraj

కొనసాగుతున్న విపక్షాల ఆందోళనలు

పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వ్యాపమ్‌, లలిత్‌ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంలు, కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి.

కాగా విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. రాజ్యసభలో మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాల్లో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు.

మధ్యప్రదేశ్‌ రైలు దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రరైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు మధ్యప్రదేశ్‌లో ప్రకటన చేశారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ చైర్మన్‌వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

English summary
Union Minister Venkaiah Naidu on Wednesday said that Minister Sushma Swaraj is Country's big asset.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X