వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ మోహరింపు: సచివాలయంలోనే మమత, రాజకీయం చేయొద్దన్న వెంకయ్య

పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల్లో గల టోల్‌ప్లాజాల వద్ద ఆర్మీ భద్రతా సిబ్బందిని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని 18 జిల్లాల్లో గల టోల్‌ప్లాజాల వద్ద ఆర్మీ భద్రతా సిబ్బందిని మోహరించడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. కాగా, రాష్ట్ర సెక్రటేరియట్‌కు 500 మీటర్ల దూరంలోనే టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి ఆర్మీ జవాన్లు తనిఖీలు చేపట్టారు.

గురువారం రాత్రి నుంచీ సచివాలయంలోనే..

రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఆర్మీని మోహరించడం ఏంటని మమతా ప్రశ్నించారు. ఇది సైనిక కుట్రనా? అని ఆమె ధ్వజమెత్తారు. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ మమతా గురువారం రాత్రి నుంచి ఇప్పటి వరకు సచివాలయంలోని ఆమె కార్యాలయంలోనే ఉన్నారు.

అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఆర్మీ ఖాళీ చేసి వెళ్లిపోయేంత వరకు కార్యాలయాన్ని విడిచి వెళ్లేది లేదని ఆమె పేర్కొన్నారు. కాగా, ఈ సమస్యను టీఎంసీ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తింది. నోట్ల రద్దుపై టీఎంసీ తలపడుతున్నందునే రాజకీయ ప్రతికారంలో భాగంగానే కేంద్రం ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు.

Coup in West Bengal- Army rubbishes Mamata's allegation

సాధారణ తనిఖీల్లో భాగంగానే: ఈస్ట్రన్ కమాండ్

ట్రాఫిక్‌ను నియంత్రించడానికి, టోల్‌ప్లాజాల వద్ద భద్రతను పర్యవేక్షించడానికి సాధారణ తనిఖీల్లో భాగంగా సిబ్బందిని మోహరించినట్లుగా ఆర్మీ స్పష్టం చేసింది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లోని అసోంలో 18 ప్రాంతాలు, అరుణాచల్‌లో 13, నాగాలాండ్‌లో 5, మేఘాలయలో 5, త్రిపుర, మిజోరాంలలో ఒక ప్రాంతంలో తనిఖీలు చేపట్టినట్లు ఈస్ట్రన్ కమాండ్ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.

రాజకీయ చేయొద్దు: వెంకయ్యనాయుడు

సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆర్మీ మోహరించడం జరిగిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్మీ తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. ఆర్మీ మోహరింపును రాజకీయం చేయొద్దని మమతకు వెంకయ్యనాయుడు హితవు పలికారు.

ఇది ఇలా ఉండగా, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా మమత ఆరోపణలపై స్పందించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆర్మీని మోహరించడం జరిగిందని స్పష్టం చేశారు.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee stayed overnight in her office taking offense to the army being deployed at toll booths in West Bengal. She cried foul and her party members termed it as a coup. However the army has rubbished these allegations and the Eastern Command of the Indian army took to its Twitter account to set the record straight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X