వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా పెళ్లి: పక్కా ప్లాన్‌తో పరువు హత్యలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులు దారుణ హత్యకు గురైన సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. కర్ణాటకలోని కోప్పల జిల్లా ఎరపంచనాల గ్రామానికి చెందిన బసవరాజు (26), కస్తూరి (24) అనే ఇద్దరు హత్యకు గురైనారు.

దంపతులను హత్య చేసిన హనుమంతరాయ (కస్తూరి అన్న)ను బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్లాపురం దగ్గర సోమవారం అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బసవరాజు, కస్తూరి ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. ఇద్దరి పెళ్లి చెయ్యడానికి పెద్దలు నిరాకరించారు. మూడు నెలల క్రితం కస్తూరికి హుబ్బళికి చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు.

వారం రోజులకే కస్తూరి పుట్టింటికి వచ్చేసింది. రెండు నెలల క్రితం కస్తూరి, బసవరాజు ఇంటి నుండి పారిపోయి వివాహం చేసుకున్నారు. పోట్టకూటి కోసం బెంగళూరు చేరుకుని హెసరుఘట్ట సమీపంలోని వినాయక నగరలో రాజన్న అనే వ్యక్తి ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. బసవరాజు టైలర్ పని చేస్తున్నాడు.

couple Kasturi and Basavaraj have been brutally murdered in Bangalore

కస్తూరి ఇంటిలోనే ఉంటున్నది. శనివారం సాయంత్రం కస్తూరి అన్న వీరి ఇంటికి వెళ్లాడు. జరిగింది ఎదో జరిగిపోయిందని, వీలు చూసుకుని ఇంటికి రావాలని చెల్లికి చెప్పాడు. అన్న వచ్చాడని సంతోషంలో కస్తురి వంటచేసి పెట్టింది.

రాత్రి బసవరాజు, కస్తురి, ఆమె అన్న హనుమంతరాయ కలిసి బోజనం చేసి నిద్రపోయారు. అయితే నిద్రపోతున్నట్లు నటించిన హనుమంతరాయ అర్దరాత్రి దాటిన తరువాత ముందుగా తీసుకు వెల్లిన కత్తి తీసుకుని బసవరాజ్ మీద ఇష్టం వచ్చినట్లు పోడిచాడు.

వారు కేకలు వెయ్యకుండ జాగ్రతలు తీసుకున్నాడు. తరువాత చెల్లి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేసి చంపేశాడు. ఇద్దరు మరణించారని నిర్దారించుకుని అక్కడి నుండి పరారైనాడు. తమ కుటుంబం పరువు పోయిందనే కారణంతోనే చెల్లిని, ఆమె భర్తను అంతం చేశానని హనుమంతరాయ పోలీసుల విచారణలో అంగీకరించాడు.

English summary
couple Kasturi and Basavaraj have been brutally murdered in Bangalore. The murderer is none other than murdered Kasturi's brother Hanumantharaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X