వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాజ్ వాదీలో చిచ్చుకు కారణం.....అమర్ సింగ్ రీ ఎంట్రీయేనా

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో సంక్భోభం ముదురుతోంది. కుటుంబంలో నెలకొన్ని చిచ్చు కొంత కాలం క్రితం సద్దుమణిగినట్టు కన్పించినా...తిరిగి రాజుకొంది.పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శివపాల్ సింగ్ ను మంత్రి పదవి నుండి తప్పించారు సిఎం అఖిలేష్. తమ కుటుంబంలో విచ్చిన్నానికి పార్టీ నాయకుడు అమర్ సింగ్ కుట్ర పన్నారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు.

సమాజ్ వాద్ పార్టీలో అమర్ సింగ్ పున: ప్రవేశాన్ని అఖిలేష్ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతను పక్కన పెట్టి కూడ ములాయం సింగ్ .. అమర్ సింగ్ ను పార్టీలో చేర్చుకొన్నారు..అమర్ సింగ్ పార్టీలో పున: ప్రవేశం తర్వాత పార్టీలో సంక్షోభానికి కారణమయ్యారని అఖిలేష్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.కుటుంబంలో కూడ చిచ్చుకు అమర్ సింగే కారణమయ్యారని అఖిలేష్ ఆరోపిస్తున్నారు.పార్టీలో విబేదాలు తారాస్థాయికి చేరడంతో అఖిలేష్ ఇవాళ శివపాల్ యాదవ్ తో పాటు నలుగురు మంత్రులపై వేటు వేశారు.అమర్ సింగ్ కు సన్నిహితంగా ఉండే సినీ నటి జయప్రదను కూడ ఎప్ డి సి పదవి నుండి తొలగించారు.

సమాజ్ వాదీలో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న పార్టీ సీనియర్ ఉదయ్ వీర్ సింగ్ పార్టీ నుంబి బహిష్కరణకు గురయ్యారు.ఎస్ పి లో సంక్షోభానికి అమర్ సింగ్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు.బిజెపి నాయకత్వంతో చేతులు కలిపి ఎస్ పి ని నాశనం చేసేందుకు అమర్ సింగ్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ విషయమై ఆయన ఒక జాతీయ న్యూస్ చానల్ కు తెలిపారు.

త్వరలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో సమాజ్ వాదీ పార్టీ లో సంక్సోభం ఆ పార్టీకి నష్టం కల్గించే అవకాశం ఉంది. పార్టీలోని యువ ఎంఏల్ఏలు అఖిలేష్ వైపు మొగ్గు చూపుతున్నారు. కుటుంబంలోని గొడవలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయి.

amarsingh

సమాజ్ వాదీ పార్టీలోకి అమర్ సింగ్ పున: ప్రవేశం తర్వాత ఈ రకమైన పరిణామాలు చోటుచేసుకొనే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజం ఖాన్ కూడ అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలన్నీ చూస్తే అఖిలేష్ కు , శివపాల్ కు మద్య ఆధిపత్యపోరుగా తెరతీశాయి. పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అ యితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖ చర్చనీయాంశమైంది. ఈ లేఖలో ఆయన అఖిలేష్ కు మద్దతు పలికారు.ములాయం సింగ్ ను కొందరు తప్పుదోవపట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా ఆయన అమర్ సింగ్ పై విమర్శలు గుప్పించారు.

English summary
crises in samajwadi party because of amarsingh .. yes it si true..uttarpradesh cm supporters alleged this .When amarsing re entry into the party crises started.akhilesh supporters slowly suspended party state chief.some sp leaders also akhilesh said this whole issue create because of amarsingh.some leaders expected this situation in party because of amarsingh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X