వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలపరీక్ష రోజు ఇదీ జరిగింది!: గవర్నర్‌కు రిపోర్ట్, జయ కుర్చీలో పళని

తమిళనాడు శాసన సభలో పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా జరిగిన ఆందోలనకర పరిణామాలపై శాసన సభ కార్యదర్శి జమాలుద్దీన్.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు నివేదిక అందించారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: తమిళనాడు శాసన సభలో పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా జరిగిన ఆందోలనకర పరిణామాలపై శాసన సభ కార్యదర్శి జమాలుద్దీన్.. రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు నివేదిక అందించారు.

శనివారం నాడు తమిళ శాసన సభలో ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణలో నెగ్గిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్హిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ జరిగిన తీరుపై విపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి.

<strong>శశికళకు మరో షాక్: భర్త కూడా జైలుకెళ్లక తప్పదా? ఇదీ కేసు?</strong>శశికళకు మరో షాక్: భర్త కూడా జైలుకెళ్లక తప్పదా? ఇదీ కేసు?

ఆయన నివేదిక అఢిగారు. ఈ నేపథ్యంలో సభలో చోటుచేసుకున్న పరిణామాలను జమాలుద్దీన్‌ నివేదిక ఇచ్చారు. పళనిస్వామి బలపరీక్ష చెల్లదని డీఎంకే నాయకులు స్టాలిన్‌, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్‌ చేస్తున్నారు.

CS gives report to Governor on TN Assembly incidents

శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలపై నివేదిక సమర్పించాల్సిందిగా శాసనసభ కార్యదర్శి జమాలుద్దీన్‌ను గవర్నర్‌ ఆదేశించారు. సభ ఉదయం నుంచి మొదలైనప్పటి నుంచి నిరవధికంగా వాయిదా పడిన వరకు జరిగిన మొత్తం ప్రక్రియపై పత్రాలు, వీడియో దృశ్యాలతో ఆధార సహితంగా నివేదిక ఇవ్వాలని సూచించారు.

<strong>నాకు ప్రాణహాని, వాతావరణం బాగాలేదు, చెన్నై పంపించండి: శశికళ</strong>నాకు ప్రాణహాని, వాతావరణం బాగాలేదు, చెన్నై పంపించండి: శశికళ

జయలలిత కుర్చీలో..

ముఖ్యమంత్రి పళనిస్వామి పూర్తిస్థాయిలో పాలన మీద దృష్టి సారించారు. అయిదు నెలల తర్వాత తొలిసారి జయలలిత కార్యాలయానికి వెళ్లి ఆమె వాడిన కూర్చీలో కూర్చున్నారు. జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆ కుర్చీలో ఎవరూ కూర్చోలేదు.

పన్నీర్ ముఖ్యమంత్రి అయినా జయ మీదున్న గౌరవంతో ఆ కార్యాలయానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు పళనిస్వామి మాత్రం నేరుగా కార్యాలయానికి వెళ్లి, జయ కుర్చీలో కూర్చొని, కొన్ని ఫైళ్లపై సంతకాలు కూడా చేశారు. అయితే, బాధ్యతలను స్వీకరించే సమయంలో మాత్రం జయలలిత ఫొటోను టేబుల్ పైన పెట్టుకున్నారు.

<strong>శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..</strong>శశికళకు రివర్స్: ప్రాణహానీ లేదని చెప్పిన కర్నాటక ఐబీ, అదే జరిగితే..

పళనిస్వామి సోమవారం సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తొలుత మెరీనా తీరంలోని జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ ఆయనకు స్వాగతం పలికారు.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం లోకసభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, రాష్ట్ర మంత్రులు ఆయనకు అభినందనలు తెలిపారు. పళనిస్వామి అయిదు ఫైళ్ల పైన సంతకాలు చేశారు.

English summary
Tamil Nadu chief Secretary gave report to Governor Vidyasagar Rao on Assembly incidents on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X