చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు యూనిఫాంలో డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

చెన్నై: విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారి యూనిఫాం ధరించి డ్యాన్స్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీంతో ఉన్నతాధికారులు ఆ పోలీసుపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్‌గా 58 ఏళ్ల శంకరన్ విధులను నిర్వహిస్తున్నారు. అయితే గత నెల జనవరిలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన చెన్నై వెళ్లారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆయన యూనిఫాం ధరించి డ్యాన్స్ చేశారు.

'Dancing deputy jailer' of Salem prison suspended after video of him shaking a leg goes viral

శంకరన్ డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో తోటి అధికారులు ప్రోత్సహించడంతో పాటు తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో శంకరన్ కొంప ముంచింది. ఎవరో ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో పాటు వాట్సప్‌లో కూడా షేర్ చేశారు.

దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో శంకరన్‌ను అత్తూరు నుంచి కోయంబత్తూరుకు బదిలీ చేసి, విచారణకు ఆదేశించారు. సేలం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా శంకరన్‌పై చర్యలు తీసుకున్నారు.

English summary
Deputy jailer of Attur sub jail in Salem, Tamil Nadu, Shankaran, made an impromptu dance performance in January for his colleagues. But to his bad luck, some of them made a video of him dancing, and it soon went viral on Facebook and Whatsapp. Now, Shankaran has been suspended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X