వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారత అమ్మాయిలు డేటింగ్‌కు రారు, షేకండివ్వరు’

|
Google Oneindia TeluguNews

ముంబై: అంతర్జాతీయ పర్యాటకులకు ఇచ్చే హ్యాండ్‌బుక్'ట్రావెలర్స్ గైడ్ అండ్ ది స్కాలర్స్ మాన్యువల్'‌లో భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసిసిఆర్) భారత మహిళల గురించిన పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపర్చింది.

'భారతీయ మహిళలు సంప్రదాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. పరిచయం లేనివారికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వరు. డేటింగ్‌కు అస్సలు ఒప్పుకోరు. సినిమాకి రమ్మంటే మర్యాదగా తిరస్కరిస్తారు' ఇలా అనేక విషయాలను ఈ పుస్తకంలో పేర్కొంది.

అంతర్జాతీయ పర్యాటకులకు, విద్యార్థులకు భారత దేశం గురించి వివరిస్తూ ఈ పుస్తకం ఓ మార్గదర్శకంగా పనిచేస్తుందని పేర్కొంది. భారతీయులు, వారు పాటించే ఆచార వ్యవహారాలను ఈ పుస్తకంలో వివరించారు.

Dating not common, most Indian women don't shake hands: ICCR

భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) ''ట్రావెలర్స్ గైడ్ అండ్ ది స్కాలర్స్ మాన్యువల్'' మొదటి ముద్రణ 1999లో జరిగింది. దీనిని ఇప్పుడు మరింత సంస్కరించి ముద్రించారు.

ఈ పుస్తకంలో ఇంకా ఏముందంటే.. 'గత కొన్ని దశాబ్దాల్లో విద్యావంతులైన మహిళలు అనేక సంప్రదాయ అడ్డంకులను అధిగమించారు. ఆధునికత సంతరించుకున్నారు. పురుష విద్యార్థిని పరిచయం చేస్తే అమ్మాయిలు మాట్లాడతారు' అని పుస్తకంలో ఉంది.

'ఆధునిక భారతీయ మహిళలు కొన్ని విధాలుగా సంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు. సినిమాకి గానీ, ఔటింగ్‌కు కానీ రమ్మని ఏ మగాడైనా అడిగాడంటే సున్నితంగా తిరస్కరిస్తారు. డేటింగ్ ఇండియాలో కామన్ కాదు.' అని ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఇక్కడి అమ్మాయిలతో ఎలా నడచుకోవాలి అనే విషయాలు ఇందులో స్పష్టంగా పేర్కొంది.

English summary
This is 2016 but women in India don't generally shake hands. Dating is uncustomary. Females of this country are traditional and may refuse politely if asked out for a film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X