వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూగ యువతిపై రేప్, హత్య: అర్ధనగ్నంగా వదిలేశారు

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భోగినిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ 17ఏళ్ల మూగ, చెవిటి యువతిపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు, ఆ తర్వాత దారుణంగా హత్య చేశాడు. శనివారం ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

అర్ధనగ్నంగా ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దుండగుడు, ఆమెను దుప్పట్టతో ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Deaf and dumb girl raped, killed in Kanpur

ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఆఫీసర్ అలోక్ శర్మ తెలిపారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. అత్యాచారం జరిగినట్లు తేలితే నిందితుడిపై రేప్ కేసు నమోదు చేస్తామని తెలిపారు. కేసులో కొందరు అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

బాధితురాలి తండ్రి కథనం ప్రకారం.. శుక్రవారం ఆ యువతి మత సంబంధమైన వేడుకలో హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె కోసం గాలించారు. ఆమె దొరకక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అంతలోనే తమ కూతురు హత్యకు గురైనట్లు సమాచారం అందిందని చెప్పారు.

English summary
A 17-year-old deaf and dumb girl was allegedly raped and killed under the limits of Bhognipur police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X