చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇన్ఫోసిస్ క్యాంపస్ లో టెక్కీ శవం: కుళ్లిపోయింది, శరీరంపై రక్తం, హత్య జరిగిందా ?

ఉద్యోగానికి హాజరైన ఇన్ఫోసిస్ కార్యాలయం క్యాంపస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చెన్నై నగర శివార్లలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉద్యోగానికి హాజరైన ఇన్ఫోసిస్ కార్యాలయం సాఫ్ట్ వేర్ ఇంజనీరు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన చెన్నై నగర శివార్లలో జరిగింది. చెన్నై నగర శివార్లలోని మహింద్రా సిటీ ఆవరణంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆవరణంలో ఇళయరాజా అనే టెక్కీ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడని పోలీసులు చెప్పారు.

బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులు మహింద్రా సిటీ ఆవరణంలోని ఇన్ఫోసిస్ కార్యాలయం చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో మరణించింది ఇళయరాజాగా గుర్తించి మృతదేహాన్ని చెంగల్ పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉద్యోగుల కోసం క్వాటర్స్

ఉద్యోగుల కోసం క్వాటర్స్

విధులు ఆలస్యం అయితే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు క్యాంపస్ ఆవరణంలోనే వసతి గృహాలు (క్వాటర్స్) ఏర్పాటు చేశాయి. ఉద్యోగులు ఇంటికి వెళ్లడానికి ఆలస్యం అయితే ఇలాంటి క్వాటర్స్ లోనే విశ్రాంతి తీసుకుని తరువాత గమ్యం చేరుకుంటున్నారు.

క్వాటర్స్ లో కుళ్లిపోయిన ఇళయరాజా శవం !

క్వాటర్స్ లో కుళ్లిపోయిన ఇళయరాజా శవం !

బుధవారం పోలీసులు మహింద్రా సిటీలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ఆవరణంలోని వసతి గృహంలో పరిశీలించారు. అదే వసతి గృహంలో ఇళయరాజా అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం గుర్తించారు. ఇళయరాజా మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తోందని పోలీసులు చెప్పారు.

ఇళయరాజా శరీరంపై రక్తపు మరకలు !

ఇళయరాజా శరీరంపై రక్తపు మరకలు !

ఇళయరాజా రెండు మూడు రోజుల క్రితం మరణించాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఇళయరాజా మృతదేహం గుర్తించామని, చెవులు, ముక్కు, నోటీలో రక్తం కారుతోందని, అతని శరీరం మీద రక్తం మరకలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.

హత్య చేశారంటూ అనుమానం ?

హత్య చేశారంటూ అనుమానం ?

ఇళయరాజాను ఎవరైనా హత్య చేశారా ? అంటూ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మరకలు పరిశీలించి వాటి నమూనాలు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.

ఇళయరాజా ఎప్పుడు వచ్చాడు ?

ఇళయరాజా ఎప్పుడు వచ్చాడు ?

ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న ఇళయరాజా మహింద్రా సిటీలోని కార్యాలయంలోకి ఎప్పుడు వచ్చాడు ? తిరిగి ఎప్పుడు క్వాటర్స్ లోకి వెళ్లాడు ? ఎవరెవరు అతన్ని కలిశారు ? చివరి సారి అతను ఎవరికి ఫోన్ చేశాడు ? అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

అతి పెద్ద రెండవ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో !

అతి పెద్ద రెండవ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో !

చెన్నైలో ఇన్ఫోసిస్ సంస్థ రెండు అతి పెద్ద కార్యాలయాలు నిర్వహిస్తోంది. పాత మహాబలిపురం రోడ్డులోని షోలింగనల్లూరులోని రాజీవ్ గాంధీ ఐటీ హైవేలో ఓ కార్యాలయం, చంగల్ పేట్ సమీపంలోని మహింద్రా సిటీలో ఓ కార్యాలయం నిర్వహిస్తోంది.

వేల సంఖ్యలో ఉద్యోగులు, మిస్టరీగా !

వేల సంఖ్యలో ఉద్యోగులు, మిస్టరీగా !

మహింద్రా సీటీ ఆవరణంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో వేలాది మంది ఉద్యోగం చేస్తున్నారని సమాచారం. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు అన్ని సౌకర్యాలు కల్పించారని తెలిసింది. అయితే ఇళయరాజా ఎలా చనిపోయాడు ? అనే విషయం మిస్టరీగా మారిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

English summary
The body of a male techie was found inside the premises of software major Infosys at Mahindra City on the outskirts of Chennai.According to sources, the victim has been identified as Ilayaraja and his body was found in a decomposed state. Police suspect that he might have died two to three days ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X