వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మేనకోడలు దీపా వెనకడుగు: అందు కోసమే, ఏం చేస్తారు ?

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యి చివరి నిమిషంలో ఆమె బుధవారం నామినేషన్ వెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే. అయితే చివరి నిమిషంలో ఆమె బుధవారం నామినేషన్ వెయ్యకూడదని నిర్ణయం తీసుకున్నారు.

రెండాకుల చిహ్నం ఎవరికి కేటాయిస్తారో వేచి చూసి తరువాత నామినేషన్ వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకే పార్టీ సింబర్ ఎవరికి వస్తోందో అంటూ పన్నీర్ సల్వం, శశికళ వర్గంతో పాటు తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Deepa Jayakumar postponed her nomination tomorrow in RK Nagar.

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ సైతం రెండాకుల చిహ్నం తనకు కేటాయించాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. బుధవారం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో దిగడానికి నామినేషన్ వెయ్యడానికి సిద్దం అయిన దీపా జయకుమార్ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు.

రెండాకుల గుర్తు పన్నీర్ సెల్వం వర్గీయుల చేతికి వస్తే ఎలాగైనా రాజీ చేసుకుని తనకు మద్దతు తెలపాలని ఆయనకు మనవి చెయ్యాలని దీపా చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారని సమాచారం. మొత్తం మీద జయలలిత మేనకోడలు దీపా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

English summary
Deepa postponed her nomination tomorrow in RK Nagar. She is waiting for the result of double leaf symbol result it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X