మోడల్‌పై ఆటో డ్రైవర్ రేప్ యత్నం: రాళ్లతో కొట్టి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన సమయంలోనే ఓ రష్యా యువతిపై లైంగిక దాడి యత్నం జరిగింది. ఆమెపై అత్యాచారం చేసేందుకు ఓ ఆటో డ్రైవర్ ప్రయత్నించిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది.
బాధిత రష్యన్ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ వసంత్‌కుంజ్ పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం, బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఓ మోడలింగ్ ఏజెన్సీలో కో-ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న రష్యన్ యువతి వసంత్‌కుంజ్ నుంచి గ్రీన్‌పార్క్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది.
నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను ఆపిన ఆ డ్రైవర్, మొదట ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను తస్కరించేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. తనపై చేయి వేసేందుకు ప్రయత్నించిన ఆటోడ్రైవర్‌ను తోసేసిన ఆ యువతి, అతడిని రాళ్లతో కొట్టి అక్కడి నుంచి తప్పించుకుంది.
ఆ తర్వాత సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు, ఆటో రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఒబామా పర్యటనను పురస్కరించుకుని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.