వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్‌ను కత్తితో పొడిచి చంపారు: కుటుంబానికి కోటి ఆర్ధిక సాయం

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ రాజధానిలో విద్యార్ధుల చేతిలో చంపబడ్డ ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్‌ కుటుంబానికి ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల ఆర్ధిక సాయాన్ని ప్రకటించింది. తామిస్తున్న డ‌బ్బు ఆ కుటుంబానికి పరిహారంగా చెల్లించడం లేదని, ఆర్థిక సాయమే చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం మనీష్ శిసోడియా ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయిలో ప్రభుత్వ స్కూల్లో సోమవారం ముఖేశ్ కుమార్ అనే హిందీ టీచర్‌ని త‌మ‌కు హాజ‌రు వేయ‌లేద‌నే కార‌ణంతో ఇద్ద‌రు విద్యార్థులు క‌త్తితో పొడిచారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Delhi govt offers Rs 1 crore compensation for family of stabbed Delhi

ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. ఆ ఉపాధ్యాయుడి కుటుంబం అనుభవించే బాధకు ఎలాంటి పరిహారం సరిపోదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయంగా ప్రభుత్వం కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించిన‌ట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తుందని అన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికుడు ఎలా పనిచేస్తాడో అలాగే సమాజానికి గురువు తోడ్పాటు కూడా అంతే ఉంటుందని అన్నారు. కాగా, ముఖేశ్ కుమార్ సోమవారం రాత్రి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా మనీష్ శిశోడియా ఆసుప‌త్రికి చేరుకొని ఆయ‌న‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని వైద్యులకు సూచించారు.

కానీ ముఖేశ్ కుమార్ పిరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

English summary
The Delhi government will provide Rs 1 crore to the family of a school teacher stabbed to death by two of his students, it was announced on Tuesday. The teacher, Mukesh Kumar, succumbed to his injuries at a hospital on Tuesday, a day after he was attacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X