వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ కంగ్రాట్స్: ఢిల్లీలో బీజేపీ సీట్లు ఇలా.., ఐదుగురు ముస్లీంల ఓటమి

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మూడు డిల్లీ మున్సిపాలిటీల్లో నెగ్గినందుకు గ్రీటింగ్స్ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మూడు డిల్లీ మున్సిపాలిటీల్లో నెగ్గినందుకు గ్రీటింగ్స్ చెప్పారు.

ఢిల్లీ బెట్టర్ మెంట్ కోసం తమ ప్రభుత్వం ఎంసీడీతో కలిసి పని చేస్తుందన్నారు. కాగా, గత అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు నేపథ్యంలో కేజ్రీవాల్ ఈవీఎంలను తప్పుబట్టారు. ఇప్పుడు కూడా ఈవీఎంలను తప్పుబట్టారు.ఆ తర్వాత శుభాకాంక్షలు తెలిపారు.

ఆ అయిదుగురి ఓటమి

ఢిల్లీ నగర పాలక ఎన్నికలో బీజేపీ విజయ దుందుభి మోగించింది. మూడు నగర పాలికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకొని విజయ కేతనం ఎగరవేసింది.

<strong>బీజేపీ గెలిచినా.. ఏఏపీపై ప్రతీకారం: డ్రామా క్వీన్ తప్పుకో.. కేజ్రీపై ఇల్మీ</strong>బీజేపీ గెలిచినా.. ఏఏపీపై ప్రతీకారం: డ్రామా క్వీన్ తప్పుకో.. కేజ్రీపై ఇల్మీ

అయితే బీజేపీ పోటీ చేసిన తరఫున పోటీ చేసిన అయిదుగురు ముస్లిం అభ్యర్థులు ఓటమిని చవి చూశారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో బీజేపీకి ముస్లిం ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

బీజేపీకి ఎక్కడ ఎన్ని సీట్లు?

ఢిల్లీ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించింది. మొత్తం 270 వార్డుల్లో 180 స్థానాలకు పైగా గెలుచుకుని వరుసగా మూడోసారి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ను కైవసం చేసుకుంది.

2012 మున్సిపల్‌ ఎన్నికల్లో 138 స్థానాల్లో గెలుపొందగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 184 స్థానాలకు పెంచుకుంది. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్‌ కోల్పోయిన బీజేపీకి రెండేళ్లలోనే అత్యధిక మెజార్టీ రావడం గమనార్హం.

ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘోరంగా చతికిలపడింది. మొత్తం 270 స్థానాల్లో ఏఏపీ కేవలం 46 వార్డుల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్‌ కూడా మూడో స్థానానికి పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 30 స్థానాల్లో గెలిచింది.

ఢిల్లీలో 272 వార్డులుండగా రెండు స్థానాల్లో అభ్యర్థుల మృతితో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీంతో తూర్పు ఢిల్లీ కార్పొరేషన్‌లోని 63, ఉత్తర ఢిల్లీలోని 103, దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్‌లోని 104 వార్డులకు ఏప్రిల్‌ 23న ఎన్నికలు జరిగాయి.

ఉత్తర ఢిల్లీలో మొత్తం 103 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగగా.. బీజేపీ 66, ఏఏపీ 20, కాంగ్రెస్‌ 16 స్థానాల్లో గెలుపొందాయి.

దక్షిణ దిల్లీలో మొత్తం 104 స్థానాలకు గాను.. బీజేపీ 70, ఏఏపీ 16, కాంగ్రెస్‌ 12 స్థానాల్లో గెలుపొందాయి.

తూర్పు ఢిల్లీలో మొత్తం 63 స్థానాలకు గాను బీజేపీ 48, ఏఏపీ 10, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో గెలుపొందాయి. ఈ విజయంతో మరోసారి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ (ఎంసీడీ) బీజేపీ వశమైంది. గత పదేళ్లుగా ఎంసీడీలో బీజేపీనే అధికారంలో ఉండటం విశేషం. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం కూడా పెరిగింది.

English summary
Hours after his party leaders blamed EVMs for AAP's loss in the Delhi civic polls, Delhi Chief Minister Arvind Kejriwal congratulated the BJP. In a tweet he posted on Wednesday evening, Arvind Kejriwal congratulated the BJP for their victory in all three zones of tDelhi municipal corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X