వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ అరెస్టు గ్యారెంటీ ? లిస్టులో మరో 10 మంది, భయంతో !

రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎర వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతుండటంతో ఆయన అనుచరులు హడలిపోతున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: రెండాకుల చిహ్నం కోసం ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు ఎర వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీవీ దినకరన్ ను సోమవారం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వెలువడటంతో ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం దినకరన్ మెడకు చుట్టుకుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో ఆదివారం ఢిల్లీలో పరిణామాలు సాగాయి. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరించారు.

గంటలు గంటలు విచారణ

గంటలు గంటలు విచారణ

శనివారం ఏడెనిమిది గంటల పాటు టీటీవీ దినకరన్ ను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు. ఆదివారం కూడా ఆయన్న పిలిపించిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు విచారించి వివరాలు సేకరించారు.

ఉచ్చు మరింత బిగిసింది

ఉచ్చు మరింత బిగిసింది

టీటీవీ దినకరన్ కు ఉచ్చు మరింత బిగిసినట్లేనని సంకేతాలు వెలువడుతున్నాయి. ఢిల్లీ క్రైం బ్రాంచ్ ఉన్నతాధికారులు వేసిన ప్రశ్నలకు టీటీవీ దినకరన్ ఉక్కిరిబిక్కిరి అయ్యారని సమాచారం. అయినా ఢిల్లీ పోలీసు అధికారులు అనేక ప్రశ్నలు సంధించారని తెలిసింది.

సెల్ ఫోన్ నెంబర్లు, సంభాషణలు

సెల్ ఫోన్ నెంబర్లు, సంభాషణలు

సెల్ ఫోన్ నెంబర్లు, సంభాషణల ఆధారంగా పలు రకాల ప్రశ్నలతో టీటీవీ దినకరన్ ను ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాటు ఇప్పటికే అరెస్టు అయిన బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చిన వివరాల ఆధారంగా దినకరన్ ను ఢిల్లీ పోలీసు అధికారులు విచారిస్తున్నారు.

తెరమీదకు కొందరి పేర్లు

తెరమీదకు కొందరి పేర్లు

ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని కేసు నమోదు చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా కొన్ని పేర్లను వివరిస్తూ టీటీవీ దినకరన్ కు ప్రశ్నలు సంధించారు.

 తెలియదు, సంబంధం లేదు, చూడలేదు

తెలియదు, సంబంధం లేదు, చూడలేదు

ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసు అధికారులు వేసిన అనేక ప్రశ్నలకు టీటీవీ దినకరన్ తనకు తెలియదు, సంబంధం లేదు, చూడలేదు అన్న సమాధానాల్నే చెప్పారని తెలిసింది. అయితే దినకరన్ ను సామాన్యంగా వదిలిపెట్టేదిలేదని ఓ ఉన్నతాధికారి అంటున్నారు.

నేడు 4 గంటలకు హాజరుకావాలి

నేడు 4 గంటలకు హాజరుకావాలి

ఆదివారం దినకరన్ ను విచారించి పంపించిన పోలీసు అధికారులు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించారు. సోమవారం సాయంత్రం దినకరన్ ను అరెస్టు చేసే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

మరో 10 మంది, ఎవరంటే !

మరో 10 మంది, ఎవరంటే !

ఇప్పటికే ఈ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, దినకరన్ పేర్లు నమోదు చేసిన పోలీసులు మరో 10 మంది పేర్లు ఎక్కించారని తెలిసింది. అందులో దినకరన్ కు అత్యంత సన్నిహితులు ఇద్దరి పేర్లు, ఎన్నికల కార్యాలయంలో పనిచేసిన మాజీ ఉద్యోగులు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న కిందిస్థాయి సిబ్బంది పేర్లు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం.

English summary
delhi police orders TVV Dhinakaran to appear today evening 4'o clock. The Delhi police say that they have a strong case on hand against TTV Dinakaran. When asked if Dinakaran would be arrested, the officer said that they have not taken a call on that as yet. If he refuses to cooperate then an arrest would not be ruled out the officer further said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X