బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెయిల్ ఇవ్వం: పోలీసు కస్టడీకి టీటీవీ దినకరన్, బెంగళూరు, చెన్నై, కోచ్చిలో!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎరవేశారని ఆరోపణలపై అరెస్టు అయిన అన్నాడీఎంకే పార్టీ నేత టీటీవీ దినకరన్ ను బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు న్యాయస్థానంలో మనవి చేశారు.

<strong>దెబ్బకు దెయ్యం దిగింది: తలపట్టుకున్న పళనిసామి: చెత్తకుప్పలో ఫోటోలు!</strong>దెబ్బకు దెయ్యం దిగింది: తలపట్టుకున్న పళనిసామి: చెత్తకుప్పలో ఫోటోలు!

ఈ కేసుకు దినకరన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆయనకు జామీను మంజూరు చెయ్యాలని టీటీవీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఎన్నికల కమిషన్ కు లంచం ఎర వేశారని పక్కా ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.

Delhi Police says TTV Dinakaran will be taken to Chennai, Kochi & Bengaluru for investigation.

దినకరన్ ను విచారించి పూర్తి వివరాలు సేకరించడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు కోర్టులో మనవి చేశారు. దినకరన్ కు కస్టడీకి ఇవ్వడానికి ఆయన న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

<strong>పళనిసామికి పన్నీర్ సెల్వం ఝలక్: ఎదురు చెప్పిన గంటకే, ఈసీకి 6,500 పేజీలు!</strong>పళనిసామికి పన్నీర్ సెల్వం ఝలక్: ఎదురు చెప్పిన గంటకే, ఈసీకి 6,500 పేజీలు!

ఇరు వర్గాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాలుగు రోజులు దినకరన్ ను పోలీసు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దినకరన్ ను విచారించడానికి చెన్నై, కోచ్చి, బెంగళూరు నగరాలకు తీసుకు వచ్చే అవకాశం ఉందని ఢిల్లీ క్రైం బ్రాంచ్ కు చెందిన ఓ పోలీసు అధికారి మీడియాకు చెప్పారు.

English summary
Delhi court: Delhi Police says TTV Dinakaran will be taken to Chennai, Kochi & Bengaluru for investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X