వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నోట్ల రద్దు: మోడీపై అమర్త్యసేన్ షాకింగ్ వ్యాఖ్య

పెద్ద నోట్ల రద్దుపై భారతరత్న, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ప్రధాని మోడీకి షాక్ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దును ఆయన నిరంకుశచర్యగా అభివర్ణించారు.

అపార విశ్వాసమే పునాదిగా ఉన్న ఆర్థికవ్యవస్థ మూలాలనే అది దెబ్బ తీసే నిర్ణయమని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు కరెన్సీని దెబ్బతీసిందని, బ్యాంకు ఖాతాలను నిర్లక్ష్యం చేసిందని, మొత్తంగా విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థనే దెబ్బకొట్టిందని అమర్త్యసేన్‌ అన్నారు.

ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. ఆర్థికవ్యవస్థ విశ్వసనీయతపై నోట్ల రద్దు ఓ ఉత్పాతమైందని అన్నారు. గత 20 ఏళ్లలో భారతదేశం శరవేగంతో అభివృద్ధి చెందుతోందని అంటూ అదంతా కూడా పరస్పర అవగాహన, సమ్మతి మీదే ఆధారపడి కొనసాగిందని అయితే, నోట్లరద్దులాంటి నిరంకుశ చర్యను చేపట్టి మొత్తం మూలాలనే దెబ్బతీశారని అన్నారు.

Demonetisation despotic action, undermines trust: Amartya Sen

నల్లధనాన్ని వెలికితీయాలనే లక్ష్యాన్ని భారతీయులందరూ స్వాగతిస్తారని, అయితే దీనికి ఎంచుకున్న మార్గం సరైనదేనా అని ప్రశ్నించుకోవాలని అన్నారు. ప్రస్తుత విధానంలో ఫలితం తక్కువ, ఇబ్బందులు ఎక్కువ అని సేన్‌ చెప్పారు. నల్లధనాన్ని నగదు రూపంలో ఉంచేవారు ఆరుశాతం కంటే తక్కువే ఉంటారని చెప్పారు. ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ 10 శాతాన్ని మించదని తెలిపారు.

పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక రంగానికి పెను విఘాతం కలిగిస్తుందనీ స్పష్టం చేశారు. నల్లధనాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశాన్ని తాను సమర్థిస్తానని, అయితే దాన్ని అణలు చేయడంలో మాత్రం లోపాలున్నాయని అన్నారు. రూపాయి అనేది ప్రామిసరీనోటు అనీ, దాన్ని గౌరవించకపోవడమంటే వాగ్దాన భంగం చేయడమేనని అన్నారు.

తర్వాత్తర్వాత బ్యాంకు ఖాతాల విషయంలోనూ ప్రభుత్వం ఇలాగే చేసి, కొంత మొత్తం మించిన ఖాతాలను అనుమతించబోమని ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు. తాను పెట్టుబడిదారీ వ్యవస్థకు పెద్ద మద్దతుదారునేమీ కాదని, కానీ పెట్టుబడిదారి విధానం కూడా ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు.

నోట్ల రద్దును తాను ప్రధానంగా ఆర్థిక కోణం నుంచి మాత్రమే చూస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధానితో ఉన్న సైద్ధాంతిక విభేదాలతో తానీ అభిప్రాయాలు వ్యక్తం చేయడం లేదని అన్నారు. నల్లధనం విషయంలో నరేంద్ర విజయం సాధిస్తే ఆయన్ని ఆరాధించి, అభినందిస్తానని చెప్పారు.

English summary
Noting that capitalism has many successes that have come from having trust in businesses, he said if a government promises in promissory note and breaks such promise, then it is a despotic act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X