వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లాడి, విదేశాలకు చెక్కేశాడు: సుష్మకు వివాహిత ఆవేదన

విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుస్మా స్వరాజ్‌ను సాయం కోరింది ఓ మహిళ. తన భర్త తనను వివాహం చేసుకున్న 40 రోజులకే న్యూజిలాండ్ వెళ్లిపోయాడని, తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కేంద్ర మంత్రిని కోరింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుస్మా స్వరాజ్‌ను సాయం కోరింది ఓ మహిళ. తన భర్త తనను వివాహం చేసుకున్న 40 రోజులకే న్యూజిలాండ్ వెళ్లిపోయాడని, తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ కేంద్ర మంత్రిని కోరింది. అత్తంటి వారు కూడా తనను పట్టించుకోవడం లేదని, ఇంటి నుంచి వెళ్లగొట్టారనితన ఆవేదనను వెల్లబుచ్చింది.

ఈ క్రమంలోనే తాను మిమ్మల్ని(సుష్మాస్వరాజ్‌‌ను) సాయం కోరినట్లు తెలిపింది. తన భర్తను ఎలాగైనా న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు రప్పించాలని వేడుకుంది. భార్యను వదిలేయాలనుకునే ఇలాంటి ఎన్నారైలకు తగిన బుద్ధి చెప్పాలని కోరింది పంజాబ్‌కు చెందిన 29ఏళ్ల చాంద్‌దీప్‌ కౌర్‌.

 Deserted By Her NRI Husband, Punjabi Woman Seeks Sushma Swaraj's Help

చాంద్‌దీప్‌కి పంజాబ్‌కి చెందిన రమణ్‌దీప్‌తో 2015లో వివాహం జరిగింది. రమణ్‌దీప్‌ న్యూజిలాండ్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పెళ్లయ్యాక న్యూజిలాండ్‌ వెళ్లిన రమణ్‌దీప్‌ భార్య చాంద్‌దీప్‌తో మాట్లాడడం మానేశాడు. దాంతో చాంద్‌దీప్‌ 2016లో భర్తపై పంజాబ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇప్పటివరకు రమణ్‌దీప్‌ భారత్‌కు రాకపోవడంతో త్వరగా న్యూజిలాండ్‌ నుంచి తన భర్తను రప్పించాలని, అతనికి విడాకులు ఇచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చాంద్‌దీప్‌.. సుస్మాస్వరాజ్‌కు ట్విట్టర్‌ ద్వారా తన వేదనను వివరించింది. దీనిపై స్పందించిన సుష్మాస్వరాజ్‌.. కేసుకు సంబంధించిన పత్రాలను తనకు మెయిల్‌ చేయాలని సూచించారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే(2017, ఫిబ్రవరిలో) పంజాబ్‌ పోలీసులు రమణ్‌దీప్‌పై పీవో(ప్రొక్లెయిమ్డ్ అఫెండర్) జారీచేశారు.

English summary
A 29-year-old woman who has been deserted by her NRI husband has sought help from External Affairs Minister Sushma Swaraj. She has requested the minister to get him deported from New Zealand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X