వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరీ భండారీ: 1963లో నేతాజీ ఆశ్రమంలో ఉన్నారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మరో షాకింగ్ విషయం వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. 1963లో నేతాజీ... కేకే భండారీగా ఉత్తర బెంగాల్లోని శలుమరి ఆసుపత్రిలో జీవించారా? అంటే అవుననే అంటున్నారు.

తాజాగా బయటపడిన నేతాజీ ఫైల్స్‌ చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది. 1940లో విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని భావిస్తూ ఉండగా, ఆ తర్వాత కూడా ఆయన బతికే ఉన్నారనే వాదనలు తరచూ వినిపిస్తున్నాయి.

1963లో శలుమరి ఆశ్రమంలో ఉన్న కెకె భండారీ అనే వ్యక్తే నేతాజీ అని కొందరి అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం బహిర్గతం చేసిన కొన్ని ఫైల్స్‌ ఈ అనుమానాలను బహిర్గం చేస్తున్నాయి.

Did Netaji Subhas Chandra Bose live as KK Bhandari in Bengal ashram in 1960s?

శలుమరి ఆశ్రమంలో నిర్వాహకుడు రమణి రంజన్ దాస్‌ 1963లో అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూకు ఒక లేఖ రాశారు. ఆశ్రమంలో ఉన్న కెకె భండారీపై ఆయన సమాచారం అందించారు. ఆయనే నేతాజీ అయి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.

దీనికి సంబంధించిన ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రధాని కార్యాలయం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత ఈ విషయం మరుగున పడింది. ఆ తర్వాత ప్రచారంలో ఉన్న వయ్క్తి నేతాజీ కాదని ఓ కమిషన్ నివేదిక సమర్పించింది. తాజాగా ఇప్పుడు ఫైల్స్ బయటపడటంతో అసలు భండారీ ఎవరనే చర్చ ప్రారంభమైంది.

English summary
Was Netaji Subhas Chandra Bose living incognito as K K Bhandari in 1963 in Shalumari Ashram in north Bengal? A reading of one of the files on Netaji, declassified on May 27, would seem to suggest that the topmost levels of the government was discussing this man in 1963. While one of the declassified files refers repeatedly to the contents of this Netaji as Bhandari file, the latter file itself is not there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X