వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్‌కు మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా!, కావాల్సింది వినూత్న కాంగ్రెస్: దిగ్విజయ్

తమకు పూర్తిస్థాయిలో నూతన కాంగ్రెస్ కావాలని, పార్టీలో వినూత్న రాజకీయ వాతావరణం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కొత్త ప్రణాళిక, నూతన మార్గ సూచి, వినూత్న శైలి ప్రచారం కావాలని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గోవాలో అధికారం చేజారడంతో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. దిగ్విజయ్ సింగ్ వైఫల్యం వల్ల కాంగ్రెస్ అధికారానికి దూరమైంది ఇటీవల గోవా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సైతం ఆరోపించారు.

తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ సింగ్ దీనిపై స్పందించారు. తమకు పూర్తిస్థాయిలో నూతన కాంగ్రెస్ కావాలని, పార్టీలో వినూత్న రాజకీయ వాతావరణం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కొత్త ప్రణాళిక, నూతన మార్గ సూచి, వినూత్న శైలి ప్రచారం కావాలని చెప్పారు.

Digvijay Singh calls for a ‘new Congress’, says Rahul Gandhi is not acting decisively

అయితే ఈ బాధ్యతలు రాహుల్ నిర్వర్తించాలన్నారు. రాహుల్ దృఢ నిశ్చయంతో పని చేయడం లేదన్నదే తన ఫిర్యాదు అని తెలిపారు. ఇదే విషయాన్ని రాహుల్ కు పలుమార్లు చెప్పానని, మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నానని దిగ్విజయ్ స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా, ఆధునిక మార్పులకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ పని రాహుల్ గాంధీ, అధిష్టానమే చేయాలని సూచించారు.

English summary
“I would say that we want a new Congress, a new charter, a new roadmap, a new style of campaigning. A new Congress has to be built, and there is no other person who can do it better than Rahul Gandhi. He has to act… My complaint against Rahul Gandhi is that he is not acting… decisively. I have told him a number of times. Sometimes, he gets angry when I keep repeating the same thing,” digvijay said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X