వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకే ఝలక్ ఇచ్చిన దినకరన్ గ్రూప్, రామ్ నాథ్ కు మద్దతు ఇవ్వం: ఢిల్లీలో రివర్స్ గేర్ !

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ కోవింద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని అన్నాడీఎంకే లోని టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో దిగిన రామ్ నాథ్ కోవింద్ కు తాము మద్దతు ఇవ్వడం లేదని అన్నాడీఎంకే లోని టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు. అయితే మాజీ స్పీకర్ మీరా కుమార్ కు మద్దతు ఇస్తారా అంటే మాత్రం నీళ్లు నములుతున్నారు.

<strong>సినిమాలో చాన్స్: ఢిలీకి చెక్కేసిన చెన్నై చిన్నది: 50 గంటలు రోమాన్స్, తండ్రికి ఫోన్ చేసి !</strong>సినిమాలో చాన్స్: ఢిలీకి చెక్కేసిన చెన్నై చిన్నది: 50 గంటలు రోమాన్స్, తండ్రికి ఫోన్ చేసి !

ఎన్డీయే తరపున రామ్ నాథ్ కోవింద్ కు మేము మద్దతు ఇవ్వడంలేదని టీటీవీ దినకరన్ ముఖ్య అనుచరుడు, ఎమ్మెల్యే వెట్రివేల్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే వెట్రివేల్ చెన్నైలోని టీటీవీ దినకన్ ఇంటికి వెళ్లారు వెట్రివేల్ తో పాటు సినీ నటుడు, ఎమ్మెల్యే కరుణాస్ తదితర ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ ను కలిశారు.

ఎవరూ కాకపోతే, ఏంటి కథ !

ఎవరూ కాకపోతే, ఏంటి కథ !

దినకరన్ ఇంటి నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే వెట్రివేల్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇస్తారా అంటే, మా వర్గం ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు ఇవ్వడం లేదని వెట్రివేట్ అన్నారు. అయితే మీరా కుమార్ కు మద్దతు ఇష్తారా అంటే సమాధానం దాటవేశారు.

34 మందితో టీటీవీ తిక్కచేష్టలు !

34 మందితో టీటీవీ తిక్కచేష్టలు !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ తీహార్ జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని 34 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నారు. 34 మంది ఎమ్మెల్యేలతో టీటీవీ తిక్కచేష్టలు చేస్తున్నారని పన్నీర్ వర్గం మండిపడుతోంది.

మళ్లీ ఢిల్లీ కష్టాలు మొదలు ?

మళ్లీ ఢిల్లీ కష్టాలు మొదలు ?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు ఇవ్వం అంటూ టీటీవీ వర్గంలోని ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా ముందు చెప్పడంతో దినకరన్ కు మళ్లీ ఢిల్లీ కష్టాలు మొదలు కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

బెట్టు చేస్తున్నాడా ?

బెట్టు చేస్తున్నాడా ?

ఢిల్లీ వెళ్లిన సమయంలో బీజేపీ నాయకులు తనను పట్టించుకోలేదని టీటీవీ దినకరన్ ఇప్పుడు సమయం చూసి బెట్టు చేస్తున్నారా ? అంటూ తమిళనాడులో చర్చ మొదలైయ్యింది. బీజేపీ నాయకులతో బేరసారాలు చెయ్యడానికి టీటీవీ దినకరన్ ఈ సమయంలో ఇలా వ్యవహరిస్తున్నారని సమాచారం.

ఢిల్లీలో తంబిదురై రివర్స్ !

ఢిల్లీలో తంబిదురై రివర్స్ !

అన్నాడీఎంకే పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని, అందరూ కలిసే ఉన్నారని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఢిల్లీలో చెప్పారు. శశికళ వర్గంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కే మద్దతు ఇస్తున్నారని శుక్రవారం ఢిల్లీలో తంబిదురై మీడియాకు చెప్పారు. ఇప్పుడు శశికళ వర్గంలోనే రెండు వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
AIADMK Dinakaran faction MLA Vetrivel said that they are not support to the BJP Candidate in the Presidential Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X