వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవినీతి అంతం: మోడీ ప్రభుత్వంలో కీలకంగా ‘డీబీటీ’

ఇటీవల కాలంలో ప్రపంచంలో సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించే మొత్తం నేరుగా నగదు బదిలీ(డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్) చేయడం జరుగుతోంది. ఈ కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిపోయాయి.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో ప్రపంచంలో సంక్షేమ కార్యక్రమాల కోసం వెచ్చించే మొత్తం నేరుగా నగదు బదిలీ(డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్‌ఫర్) చేయడం జరుగుతోంది. ఈ కార్యకలాపాలు విస్తృతంగా పెరిగిపోయాయి. ఈ విషయాన్ని గుర్తించిన గత యూపీఏ ప్రభుత్వం కూడా పైలట్ కార్యక్రమంగా దీన్ని చేపట్టింది. అయితే, తక్కువ ఆర్థిక చేరికలు, సరిపోని ఐటీ అవస్థాపనా సౌకర్యాల కారణంగా యూపీఏ ఇందులో పూర్తిగా విఫలమైపోయింది. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం డీబీటీ వాస్తవ శక్తిని గుర్తించి అందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

డీబీటీ అంటే ఏమిటీ? ఇది ఎందుకంత ముఖ్యం?

డీబీటీ అంటే ఏమిటీ? ఇది ఎందుకంత ముఖ్యం?

డీబీటీ అంటే సబ్సిడీ లబ్ధిని నేరుగా లబ్ధిదారునికి అతని ఖాతా ద్వారా అందించడం. ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలకు ఈ విధానాన్ని ఉపయోగించడం జరుగుతోంది. దీని ద్వారా చెక్కులు, నగదు ఇవ్వడం కాకుండా నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాకు సబ్సిడీ మొత్తం జమ అవుతుంది. సంక్షేమ కార్యక్రమాల్లో జరిగే అవినీతిని ఈ విధానం పూర్తిగా కట్టడి చేస్తోంది. మధ్యవర్తులకు కూడా ఈ విధానం చెక్ పెడుతోంది.

మోడీ ప్రభుత్వంలో ఏవిధంగా అమలవుతోంది?

మోడీ ప్రభుత్వంలో ఏవిధంగా అమలవుతోంది?

ఏ రాష్ట్రానికైనా డీబీటీనీ పూర్తి అమలు చేయడం కొంత వరకు కష్టసాధ్యమే. అన్ని శాఖలు సంయమనంతో పని చేస్తుండాలి. ప్రాథమికంగా ఆర్థిక చేరికలు, ఐటీ అవస్థాపనా సౌకర్యాలు కీలకమైనవి. ప్రభుత్వ పథకాల కోసం డీబీటీని ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేసేలా చూస్తోంది. ఐటీ అవస్థాపనా , భారీ ఆర్థిక చేరికలు లేకపోవడంతో ఎల్పీజీ సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందజేయడంలో యూపీఏ ప్రభుత్వం కొంతమేర విఫలమైందనే చెప్పవచ్చు. కానీ, మోడీ ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగింది. జన్ ధన్ యోజనతో పేదలకు బ్యాంక్ ఖాతాలను తెరిచి భారీగా ఆర్థిక చేరికలను చేపట్టింది. 28కోట్లకుపైగా ప్రజలు జన్ ధన్ యోజన కింద ఖాతాలను తెరిచారు. ఇదే డీబీటీ అమలుకు కీలకంగా మారింది. అంతేగాక, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ను లింక్ చేసి డీబీటీలో జరిగే అవకతవకలకు ముగింపు పలికింది. 80కిపైగా ప్రభుత్వ పథకాలు, 15మంత్రిత్వ శాఖలు డీబీటీ కింద పని చేస్తున్నాయి.

ప్రభుత్వం వెలువరించిన నివేదిక ప్రకారం గత మూడేళ్లలో డీబీటీ ద్వారా రూ.50వేల కోట్లు పొదుపు చేయబడ్డాయి. అదే యూపీయే పాలనలో 2013-14కు గానూ కేవలం 7,367కోట్లు మాత్రమే 10.71కోట్ల మందికి డీబీటీ ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. 2016-17లో రూ. 74,502కోట్లను 33కోట్ల మంది లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.

పహల్ విజయవంతం

పహల్ విజయవంతం

2014 నవంబర్‌లో ఎల్పీజీ సబ్సిడీ డీబీటీ కోసం పహల్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. స్వచ్ఛందంగా ఎన్రోల్ చేసుకుంటే ఎల్పీజీ సబ్సిడీ డీబీటీ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం 17.50కోట్ల మంది ఎల్పీజీ సబ్సిడీనీ డీబీటీ ద్వారా పొందుతున్నారు. ఈ పథకం ద్వారా సిలిండర్ల బ్లాక్ మార్కెట్ దందాకు కేంద్రం ముగింపు పలికినట్లయింది.

కిరోసిన్‌లో డీబీటీ

కిరోసిన్‌లో డీబీటీ

దేశ వ్యాప్తంగా కిరోసిన్ సబ్సిడీని కూడా డీబీటీ ద్వారా అందజేసేందుకు కేంద్రం సిద్ధమైంది. మొదటి నాలుగు సంవత్సరాలకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వార్షిక స్లాబ్ లను ఇన్సెంటివ్స్ ఆధారంగా పొందుతాయి. ఈ పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి.

డీబీటీ ద్వారా ఫెర్టిలైజర్ సబ్సిడీ

డీబీటీ ద్వారా ఫెర్టిలైజర్ సబ్సిడీ

2017 ఖరీఫ్ సీజన్ నుంచి ఫెర్టిలైజర్ సబ్సిడీని కూడా అందజేసేందుకు కేంద్ర సిద్ధమైంది. బయోమెటిక్ అథెంటికేషన్ విధానం ద్వారా రైతులను గుర్తించి 2లక్షల పాయింట్ సేల్(పీఓఎస్)తో రూ. 70వేల కోట్ల ఫెర్టిలైజర్ సబ్సిడీని అందించాలి అంచనా వేస్తున్నారు. 17జిల్లాల్లో ఈ సబ్సిడీ విధానం అమలవుతోంది. సక్రమంగా పథకాన్ని అమలు చేసినట్లయితే ఆర్థిక సంస్కరణలు వేగంగా నమోదవుతాయి.

ముగింపు

ముగింపు

క్షేత్రస్థాయిలో జరిగే అవినీతిని డీబీటీ విధానం అంతం చేస్తుంది. ప్రజలకు ప్రభుత్వం పథకాలపై నమ్మకం ఏర్పడుతుంది. ఒకవేల కేంద్ర ప్రభుత్వం యూనివర్సల్ బేసిక్ ఇన్కామ్(యూబీఐ) ప్రవేశపెట్టాలని నిర్ణయిస్తే డీబీటీ అవస్థాపన సౌకర్యాలు అందుకు కీలకంగా మారనున్నాయి. జన్ ధన్ యోజన, ఆధార్, మొబైల్ ఈ మూడు కూడా డీబీటీ కార్యక్రమ విస్తృతికి సహకరిస్తున్నాయి.
(రన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ మేనేజింగ్ పార్ట్నర్, ఇండిపెండెంట్ రీసెచర్చర్ నితిన్ మెహతా).

English summary
Direct Cash Transfers are increasingly emerging as a key instrument of delivering social welfare benefits around the world. India also realised the potential of this mechanism and numerous pilot programmes were initiated by the UPA government. However, initial attempts by the previous government failed miserably due to low financial inclusion and inadequate IT infrastructure. Has Modi Government done anything different in realising the true potential of DBT? What has been the progress on DBT under PM Modi?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X